తెలంగాణ

ఆత్మగౌరవమే నినాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, సెప్టెంబర్ 21: ప్రజల ఆత్మగౌరవమే ఎజెండాగా ఎన్నికల బరిలోకి దిగుతామని తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో కూడా ప్రజల నుంచి ఆత్మగౌరవ నినాదమే వినిపించిందన్నారు. ఎంతో ఆశలతో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ ప్రజలకు మేలు చేకూరకపోగా కేవలం కేసీఆర్ కుటుంబానికి లబ్ధి జరుగుతోందన్నారు. ఆశించిన లక్ష్యాలు నెరవేరకపోగా ఆత్మగౌరవం కూడా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. మన నిధులు, నియామకాలు, నీళ్ళకోసం చేసిన పోరాటం వృథాగా పోయిందన్నారు. అప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టులను రీడిజైనింగ్ పేరుతో మార్చే ప్రయత్నం చేసినా అవి పూర్తికాలేదన్నారు. ఎంతో ఆత్మాభిమానంతో జీవించే రైతులు మద్దతుధర కావాలని అడిగితే బేడీలు వేసి దేశద్రోహ కేసులు పెట్టి రోడ్లపై నడిపించిన ఘనత ఈ ప్రభుత్వానిదని దుయ్యబట్టారు. ప్రజల అవసరాలే ఎజెండాగా సాగుతున్న ఈ ఎన్నికలు ప్రజలకు, నియంతృత్వవాదులకు మధ్య జరిగే పోరాటంగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరించిన టీఆర్‌ఎస్ నేతలకు ఈ ఎన్నికలు గుణపాఠం చెబుతాయన్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో యువత రాహుల్‌గాంధీ విధానాల వైపు మొగ్గు చూపుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో యువతకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్ళిన విద్యార్థులు తమకిస్తానన్న నియామకాల గురించి అడిగితే ఉస్మానియా యూనివర్సిటీలో నిర్బంధం విధించిన విషయాన్ని ఎవ్వరూ మర్చిపోరన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా సాగుతున్న ఈ ప్రభుత్వం చివరిదశకు వచ్చిందని, వచ్చే సాధారణ ఎన్నికలు వారికి చివరివన్నారు. ఎన్నికల్లో పొత్తులు చివరిదశకు వచ్చాయని, అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా పొత్తులు చేసుకుంటుండటం చరిత్రలో ఇదే మొదటిసారి అన్నారు. కాంగ్రెస్ పార్టీ కమిటీలలో ఏర్పడ్డ విభేదాలపై సీనియర్ నేతలందరితో చర్చిస్తామన్నారు.