తెలంగాణ

అంతర్మథనంలో అసమ్మతి నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 23: ముందస్తు ఎన్నికలకు తాను ముందుగానే ప్రకటించిన 105 స్థానాల అభ్యర్థుల్లో మార్పు ఉండబోదంటు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేయడంతో టికెట్ల రేసులో ఉన్న ఆశావహులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం 12 అసెంబ్లీ స్థానాలుండగా వీటిలో కోదాడ, హుజూర్‌నగర్ మినహా 10అసెంబ్లీ స్థానాలకు కేసీఆర్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించారు. వాటిలో మంత్రి జగదీష్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట, తాజామాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం అభ్యర్థిగా ఉన్న నకిరేకల్ (ఎస్సీ) నియోజకవర్గాల్లో మాత్రం ప్రస్తుతానికి ఎలాంటి అసమ్మతీ లేనప్పటికీ మిగతా ఎనిమిది స్థానాల్లో మాత్రం అసమ్మతి నేతల కార్యాకలాపాలు బహిరంగంగానే సాగుతున్నాయి. నాగార్జున సాగర్, మునుగోడు, నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల మార్పుకు డిమాండ్ చేస్తూ టికెట్లు ఆశిస్తున్న అసమ్మతి నాయకులు బలప్రదర్శనలు, పోటీ సభలతో హోరెత్తిస్తున్నారు. ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతామంటు రెబల్స్‌గా ప్రచార భేరీ మోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల మార్పు ఉండబోదంటు కేసీఆర్ స్పష్టం చేయడం వారి ఆశాలపై నీళ్లు చల్లినట్లయింది. దీంతో అసమ్మతి నేతలంతా తమ రాజకీయ భవిష్యత్ కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనంటూ నియోజకవర్గాల టీఆర్‌ఎస్ క్యాడర్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరోవైపు అసమ్మతి నేతలను బుజ్జగించే విషయమై అభ్యర్థులంతా సొంత ప్రయత్నాలు చేసినా ఆశించిన ఫలితాలు లేకపోవడంతో అసమ్మతి పరిష్కార భారాన్ని కేసీఆర్, కేటీఆర్‌లపై వేసిన అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో స్థానికేతరుడైన నోముల నరసింహయ్యకు టికెట్ ఇచ్చారని కాంగ్రెస్ దిగ్గజం కె.జనారెడ్డిపై ఆయన గెలుపు అసాధ్యమంటూ నోముల అభ్యర్థిత్వాన్ని మార్చాల్సిందేనంటు అసమ్మతి నేత ఎం.సి.కోటిరెడ్డి గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. స్థానికుడైన బీసీకి లేదా తనకు టికెట్ కేటాయించాలంటూ కోటిరెడ్డి ఇప్పటికే తన మద్దతుదారులతో బల ప్రదర్శన సైతం నిర్వహించారు. అభ్యర్థుల మార్పు లేదని కేసీఆర్ స్పష్టం చేయడంతో కోటిరెడ్డి ఏం చేయబోతారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే రీతిలో మునుగోడులో తాజామాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టికెట్ రద్ధు చేసి పార్టీ అభ్యర్ధిని మార్చాలంటు అసమ్మతి నేతలు వేనెపల్లి వెంకటేశ్వర్‌రావు, పల్లె రవికుమార్‌లు అధిష్టానంపై తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. అభ్యర్ధి మార్పు జరుగకపోతే బీసీ సంఘాల మద్ధతుతో రెబల్‌గా పోటీకి వేనెపల్లి కసరత్తు చేస్తున్నారు. నల్లగొండ నియోజకవర్గ అభ్యర్ధి కంచర్ల భూపాల్‌రెడ్డి అభ్యర్ధిత్వాన్ని మార్చి తమలో ఒకరికి టికెట్ ఇవ్వాలంటు నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జిలు చకిలం అనిల్‌కుమార్, దుబ్బాక నరసింహారెడ్డిలు డిమాండ్ చేస్తున్నారు. అభ్యర్ధిని మార్చని పక్షంలో రెబల్‌గా పోటీ చేస్తామంటూ ఇప్పటికే బలప్రదర్శనలతో అధిష్టానానికి స్పష్టమైన సంకేతాలిచ్చారు. దేవరకొండలో తాజామాజీ ఎమ్మెల్యే ఆర్.రవీంద్రకుమార్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ జడ్పీ చైర్మన్ ఎన్.బాలునాయక్ ఏకంగా పార్టీకి గుడ్‌బై కొట్టాలని నిర్ణయించుకుని ఈనెల 26న కాంగ్రెస్‌లో చేరేందుకు నిర్ణయించుకున్నారు. అలాగే మరో అసమ్మతి నేత లాలూనాయక్ సైతం రవీంద్రకుమార్‌కు సహకరించడం లేదు. మిర్యాలగూడ తాజామాజీ ఎమ్మెల్యే ఎన్.్భస్కర్‌రావు అభ్యర్థిత్వాన్ని మార్చాల్సిందేనని, టికెట్ తనకు ఇవ్వాలంటూ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి అలుగుబెల్లి రవీందర్‌రెడ్డి బలప్రదర్శనలు నిర్వహించి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. తుంగతుర్తిలో తాజామాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ అభ్యర్థిత్వాన్ని మార్చాలని, తనకు టికెట్ ఇవ్వాలంటూ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేల్ పట్టుబడుతున్నారు. భువనగిరిలో తాజామాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి టికెట్ రద్దు చేయాలని, స్థానికులకే టికెట్ కేటాయించాలని అసమ్మతి నేత చింతల వెంకటేశ్వర్‌రెడ్డి అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఆలేరులో తాజామాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న అసమ్మతి నాయకులు ఆమె ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే తాజాగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో మార్పులు ఉండబోవని కేసీఆర్ స్పష్టం చేయడంతో ఇక తాము ఎలా తమ పంతం నెగ్గించుకోవాలన్నదానిపై అసమ్మతి నేతలు అనుచరులతో రహస్య సమావేశాలతో అంతర్మథనం సాగిస్తున్నారు. తాము ఆశించిన రీతిలో అభ్యర్థుల మార్పు జరుగని పక్షంలో వారికి సహాయ నిరాకరణ చేయడం, లేదా రెబల్‌గా పోటీకి దిగి తమ సత్తా చాటడం, లేక పార్టీ మారడంలో ఏదో ఒక దారిని ఎంచుకునేందుకు ఎక్కువ మంది అసమ్మతి నేతలు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇందులో పార్టీ అధిష్టానం బుజ్జగింపులకు తలొగ్గే వారు ఎందరు, తిరుగుబాటు చేసేవారు ఎందరన్నదీ త్వరలోనే తేలనుంది.