తెలంగాణ

మార్క్‌ఫెడ్‌కు కందులు, పల్లీ, సోయా కొనుగోలు బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 24: తెలంగాణలో 2018-19 సంవత్సరానికి రైతుల నుండి కందులు, పల్లీ, సోయాబీన్ కొనుగోలుకోసం మార్క్‌ఫెడ్‌ను నోడల్ ఏజన్సీగా నియమించారు. రైతులకు కనీస మద్దతు ధర లభించేందుకు వీలుగా మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించారు. వ్యాపారులు తక్కువ ధరకు రైతుల నుండి కందులు, పల్లీ, సోయాబీన్ కొనుగోలు చేయకుండా నివారించేందుకు ప్రభుత్వ నిర్ణయం తోడ్పడుతుంది. రైతులందరికీ మార్క్‌ఫెడ్ కనీస మద్దతు ధర ఇచ్చి ఈ పంటల ఉత్పత్తులను కొనుగోలు చేయడం వల్ల వ్యాపారులపై ప్రభావం పడుతుందని భావిస్తున్నారు. ఈ పంటల ఉత్పత్తుల కొనుగోలుకు మార్క్‌ఫెడ్ బ్యాంకుల నుండి రుణం తీసుకునేందుకు ప్రభుత్వమే పూచికత్తు ఇస్తుంది. కందులు, పల్లీ, సోయాబీన్ కొనుగోలుకోసం మార్కెట్‌ఫీజును ఉపసంహరిస్తూ, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి పేరుతో సోమవారం మూడు జీఓలు వేర్వేరుగా జారీ అయ్యాయి.