తెలంగాణ

కృత్రిమ మేధ రంగంలో 5.4 కోట్ల ఉద్యోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 25: భవిష్యత్‌లో 65 శాతం ఉద్యోగాలు ప్రస్తుతం మనుగడలో లేని కొత్త రంగానికి చెందినవే ఉంటాయని, ఆ అవసరాలకు తగ్గట్టు ఇప్పటి నుండి సన్నద్ధం కావాలని ఇన్ఫోపీర్స్ సొల్యూషన్స్ సీఈఓ భరణి కుమార్ అరోల్ సూచించారు. గీతం వర్శిటీ కంప్యూటర్ సైన్స్ విభాగం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ కృత్రిమ మేథ రంగంలో రానున్న ఐదేళ్లలో 5.4 కోట్ల ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, అవన్నీ కొత్తగా వస్తున్న రంగాలకు చెందినవేనని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం చాలా వేగంగా మారిపోతోందని, ఆ మార్పును అందిపుచ్చుకోవాలని అన్నారు. నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ అని, నిరంతర అభ్యాసం ఆవశ్యమని చెప్పారు. ఇందులో ఏ మాత్రం రాజీ పడ్డా జీవితంలో వెనుకబడిపోవడం ఖాయమని ఆయన హెచ్చరించారు. విజయానికి ఆవిష్కరణలే ప్రాతిపదిక అని, విభిన్నంగా, వినూత్నంగా ఆలోచించి ఉద్యోగాలు ఇచ్చే వారిగా ఎదగాలని అన్నారు. ఉద్యోగాలు చేసే వారికన్నా అవి సృష్టించే దేశమే వేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. మేథో సంపన్న హక్కులను పొందడంలో మనం చాలా వెనుకబడిపోయామని, చైనాను చూసి స్ఫూర్తిని పొందాలని ఆరోల్ పిలుపునిచ్చారు. 2020 నాటికి మన దేశం 400 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్‌ను దిగుమతి చేసుకోబోతోందని, దీనివల్ల ద్రవ్యోల్బణం ఏర్పడటంతో పాటు రూపాయి విలువ బాగా క్షీణించే ప్రమాదం లేకపోలేదని చెప్పారు. దానిని అధిగమించడానికి ఏవియేషన్ రంగంపై ఎక్కువగా దృష్టి సారించాల్సి ఉందని అన్నారు. ఎలక్ట్రానిక్స్‌లో పట్టుసాధిస్తే మన రక్షణ రంగం అవసరాలను తీర్చవచ్చని, కేవలం రక్షణ రంగంలోనే రానున్న మూడేళ్లలో 40 బిలియన్ అమెరికన్ డాలర్లు వెచ్చించబోతున్నట్టు ఆయన చెప్పారు. సైబర్ భద్రతపై మరింత పట్టుసాధించాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ప్రజల జీవనాన్ని సుఖవంతం చేసేలా ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ రంగం వృద్ధి చెందుతుందని, ఒకదానితో మరొకటి అనుసంథానం అయ్యే ఐదు లక్షల ఉపకరణాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. కార్యక్రమంలో రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్‌ఆర్ వర్మ, డీన్ వై లక్ష్మణ్ కుమార్, సీహెచ్ సంజయ్‌లు పాల్గొన్నారు.