తెలంగాణ

కక్ష సాధింపైతే జానా, జైపాల్ ఇళ్లలోనూ సోదాలు జరిగేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 28: రేవంత్‌రెడ్డి ఇళ్లపై జరగుతోన్న ఐటీ దాడులతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ ఖండించారు. ఆర్థిక లావాదేవీల్లో జరిగిన అక్రమాలపై సోదాలు జరుగుతుంటే ఇది టీఆర్‌ఎస్ పనన్నట్టు కాంగ్రెస్ నాయకులు విమర్శించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. రాజకీయ కక్ష సాధింపుతో ఐటీ దాడులు జరిగింది నిజమైతే మరి 40 ఏళ్లకుపైగా రాజకీయాల్లో కొనసాగుతున్న ఆ పార్టీ సీనియర్లు జైపాల్‌రెడ్డి, జానారెడ్డి ఇళ్లపై జరిగేవి కదా అని సుమన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్టువర్టుపురం దొంగల ముఠాగా మారిందని బాల్క సుమన్ తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. ఒకే అడ్రస్‌పై 18-19 డొల్ల కంపెనీలు పని చేయడం ఏ విధంగా చట్టబద్ధమో కాంగ్రెస్ నాయకులే చెప్పాలని సుమన్ డిమాండ్ చేసారు. విదేశీ బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి ఒకేరోజు రూ.20 కోట్లకు పైగా లావాదేవీలు నిర్వహించడం నేరం కాదా? అని ప్రశ్నించారు. ఐటీశాఖకు రేవంత్‌రెడ్డి అడ్డంగా దొరికిపోవడంతో ధిక్కుతోచక కాంగ్రెస్ నాయకులు టీఆర్‌ఎస్‌పై బురదజల్లుతున్నారని సుమన్ విమర్శించారు.