తెలంగాణ

టీఆర్‌ఎస్ కాంగ్రెస్..టీడీపీలతో ఎన్నికల పొత్తు పెట్టుకోలేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 28: మహాకూటమిని మహా ద్రోహ కూటమి అని కేసీఆర్ అంటున్నారని, 2004లోనూ, 2009లోనూ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ , కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోలేదా అని టీటీడీపీ అధికార ప్రతినిధి నెల్లూరు దర్గాప్రసాద్ ప్రశ్నించారు. శుక్రవారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తోందని అంటూనే ఆయన పేరును పెట్టుకుని ఆ పార్టీపైనే కుట్రలు పన్నడం సబబా అని నిలదీశారు. టీడీపీ నేతలను ఆహ్వానించి టీఆర్‌ఎస్‌లోకి తీసుకుని మంత్రి పదవులు ఇచ్చినపుడు ఇవన్నీ గుర్తుకు రాలేదా అని అన్నారు. ఆంధ్రా పార్టీ అని పదే పదే అంటున్నారని, తెలుగుదేశం పార్టీకి సిద్ధాంతాలు ఉన్నాయని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కేంద్రం నెరవేర్చలేదని అన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవం దెబ్బతిన్నాదని కనుకనే కేంద్రంలో బీజేపీ వ్యతిరేకంగానూ, తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా కూటమి కడుతున్నామని పేర్కొన్నారు. ఈరోజు జనం కోరుకుంటేనే మహా కూటమి ఉత్పన్నమైందని, కేసీఆర్ కుటుంబం నుండి విముక్తి పొందడానికి మహా కూటమి ఏర్పాటు కావాలని జనం కోరుకుంటున్నారని అన్నారు. మహాకూటమికి సీట్లు, ఓట్లు ముఖ్యం కాదని, టీఆర్‌ఎస్‌ను గద్దెదించడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. ఉమ్మడి కామన్ మ్యాన్ ప్రోగ్రాంను జనం ముందుకు తీసుకువెళ్తామని అన్నారు.
0.1 శాతం ఉన్న పార్టీలపై విమర్శలు ఎందుకని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌లో తెలుగుదేశం హయాంలోనే కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, కల్వకుర్తి 95 శాతం ప్రాజెక్టుల పనులు పూర్తయ్యాయని అన్నారు. పదే పదే కోటి ఎకరాలకు నీరు అందిస్తామని చెప్పి కేసీఆర్ పాలమూరు- రంగారెడ్డికి నీరు ఇవ్వలేదని అన్నారు. రెండు నెలలు ఓపిక పడితే కేసీఆర్ కుటుంబం ఎంత దోచుకుందో బయటపెడతామని అన్నారు. ప్రతి రోజు ప్రతి పక్షాలపై విమర్శలు చేయడం మినహా చేసిన అభివృద్ధి ఏమీ లేదని పేర్కొన్నారు. ఒక సామాజిక మార్గాన్ని తొక్కి అధికారంలోకి రావాలనుకోవడం హిట్లర్ వల్లనే కదురలేదని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చితే ఈరోజున మహా కూటమి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండేది కాదని ఆయన కేటీఆర్‌ను ప్రశ్నించారు.
కామన్ మినిమమ్ ప్రోగ్రాం ద్వారా మహాకూటమి అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. మహాకూటమి అధికారంలోకి రాగానే లక్ష ఉద్యోగాలు, మెగా డిస్సీ, నిరుద్యోగ భృతికి పెద్దపీట వేస్తామని అన్నారు. టీఆర్‌ఎస్‌కు అధికార మదం బాగా ఎక్కిందని , తెలుగు సమాజం తప్పకుండా అధికార మదాన్ని దించి కేసీఆర్‌కు బుద్ధి చెబుతారని అన్నారు.