తెలంగాణ

కృష్ణా ముసాయదా ఆపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 1: తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగిస్తున్న కృష్ణానదీ యాజమాన్య బోర్డు చర్యలను ఆ రాష్ట్ర సిఎం కె చంద్రశేఖర్‌రావు, నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు వేర్వేరు ప్రకటనల్లో తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు బుధవారం వేర్వేరుగా కేంద్రానికి లేఖలు రాశారు. కృష్ణానదీ జలాలను వినియోగిస్తున్న తెలంగాణను సంప్రదించకుండా విస్తృతంగా చర్చలు జరపకుండా కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి తన లేఖలో ఆరోపించారు. బోర్డు నిర్ణయాలు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని పేర్కొన్నారు. కృష్ణా జలాలలో తెలంగాణ వాటా తేలకుండా బోర్డు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని, ముసాయదాను రూపొం దించవద్దని కేంద్రానికి సూచించారు.