తెలంగాణ

టీఆర్‌ఎస్‌లో హుజూర్‌నగర్, కోదాడ టికెట్ల లొల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, అక్టోబర్ 1: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని హుజూర్‌నగర్, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గాల టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఎంపిక ఆ పార్టీ అధిష్ఠానానికి ముచ్చెమటలు పట్టిస్తోంది. హుజూర్‌నగర్ నియోజవర్గం టీఆర్‌ఎస్ టికెట్‌ను తనకే ఇవ్వాలని.. లేదంటే తాను సూచించిన ఎన్నారై అప్పిరెడ్డికే ఇవ్వాలని ఆ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి కాసోజు శంకరమ్మ టీఆర్‌ఎస్ అధిష్ఠానానికి అల్టిమేటం ఇచ్చారు. సోమవారం తన వర్గీయులతో భేటీ అయన శంకరమ్మ హుజూర్‌నగర్ టికెట్‌ను ఎన్నారై సైదిరెడ్డి తనకే ఇచ్చారంటూ ప్రచారం చేసుకుంటున్నారని అదే జరిగితే తమ సహాయ నిరాకరణను టీఆర్‌ఎస్ ఎదుర్కొనక తప్పదన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంత్‌చారి తల్లిగా తాను నియోజకవర్గంలో గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థ్ధిగా పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై పోటీ చేసి ఓడినప్పటి నుంచి ఇప్పటిదాకా నియోజకవర్గ ప్రజల మధ్య ఉంటూ పనిచేస్తున్నానన్నారు. తానే ఈ దఫా ఎన్నికల్లో ఉత్తమ్‌ను ఓడిస్తానన్నారు. అంతేగాని ఆరునెలల క్రితం వచ్చిన ఎన్నారైలు పోటీ చేస్తేనే ఉత్తమ్‌ను ఓడిస్తారన్న భ్రమను టీఆర్‌ఎస్ అధిష్టానం వీడాలన్నారు. ఎన్నారై అభ్యర్ధినే పోటీ పెట్టాలనుకుంటే మంత్రి జగదీష్‌రెడ్డి బినామీ సైదిరెడ్డికి బదులుగా స్థానికుడైన మరో ఎన్నారై అప్పిరెడ్డికే పార్టీ టికెట్ ఇవ్వాలని అలాగైతే తాను దగ్గరుండి అప్పిరెడ్డిని గెలిపించుకుంటాన్నారు. పార్టీ అధిష్టానం ఉద్యమకారుల త్యాగాలను గుర్తుంచుకుని తగిన న్యాయం చేయాలన్నారు. డబ్బుంటేనే ఎన్నికల్లో గెలుస్తారన్న ఆలోచన సరికాదన్నారు.
కేసీఆర్, కేటీఆర్‌లకు నిజంగా తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులపై ప్రేమ ఉంటే వేయి మంది అమరులలో ఒక్క అమరుడి కుటుంబానికైనా టికెట్ ఇవ్వాలన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇతర జనరల్ సీట్లు వదిలేసి కేవలం ఒక బీసీ మహిళ, అమరవీరుడి తల్లి అడుగుతున్న హుజూర్‌నగర్ సీటునే ఎందుకు ఇతరులకు ఇవ్వాలనుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ఆరునెలల క్రితం వచ్చిన సైదిరెడ్డి ఉత్తమ్‌ను డబ్బుతో ఓడిస్తాడనుకుంటే అంతకంటే డబ్బున్న అప్పిరెడ్డికి టికెట్ ఇవ్వాలన్నారు. ఉత్తమ్‌పై తాను గెలువలేకపోతే తనకు మరో నియోజకవర్గం టికెట్‌ను ఎందుకు కేటాయించడం లేదంటూ నిలదీశారు. కాగా ఇదే నియోజకవర్గం టీఆర్‌ఎస్ టికెట్‌ను మరో సీనియర్ నేత సామల శివారెడ్డి కోరుకుంటుండగా ఆయన సైతం తనకు టికెట్ ఇస్తే ఉత్తమ్‌ను ఓడిస్తానని, టికెట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించారు. మరోవైపు కోదాడ టీఆర్‌ఎస్ టికెట్‌ను నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి కన్మంత్‌రెడ్డి శశీధర్‌రెడ్డికి కేటాయించాలంటూ సోమవారం కోదాడలో జరిగిన కార్యకర్తల సమావేశంలో మార్కెట్ కమిటీ డైరక్టర్ బాణోతు బాబు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నంతో కలకలం సృష్టించారు. సాక్షాత్ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ ఎదుటనే బాబు ఆత్మహత్యా యత్నం చేయడం గమనార్హం. పక్కనే ఉన్న పార్టీ కార్యకర్తలు బాబును అడ్డుకుని వారించారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన శశీధర్‌రెడ్డికి టికెట్ ఇవ్వకుండా వలస పక్షులకు టికెట్లు ఇస్తే ఇలాంటి ఘటనలు పునారావృతమవుతాయని బాబు హెచ్చరించాడు. దీంతో జిల్లాలో కోదాడ, హుజూర్‌నగర్ టికెట్ల పంచాయితీ తీర్చడం టీఆర్‌ఎస్ అధిష్ఠానానికి చిక్కుముడిగా మారింది.