తెలంగాణ

ఔషధ నగరికి అవాంతరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 25: రంగారెడ్డి జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఫార్మాసిటీ (ఔషధ నగరి) కోసం కొనసాగుతున్న భూసేకరణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణ మొదలైంది. ఫార్మాసిటీ కోసం సుమారు 10,939 ఎకరాలు సేకరించాల్సి ఉండగా అందులో కందుకూరు మండలం ముచ్చెర్ల రెవిన్యూ పరిధిలోని సర్వే నెం.288లో భూ కేటాయింపు ప్రక్రియ సక్రమంగా జరగలేదన్న ఆరోపణలపై రంగారెడ్డి జిల్లా యంత్రాంగం విచారణ మొదలుపెట్టింది. ఈ సర్వే నెంబరులో 134 ఎకరాల లావుని పట్టా భూములతోపాటు కబ్జాదారుల చేతుల్లో ఉన్న 32 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. వీరికి కూడా ప్రభుత్వం తరఫున పరిహారం చెల్లించేందుకు నిర్ణయించారు. దీనితోపాటు ఈ సర్వే నెంబర్‌లోని 381.31 ఎకరాల పట్టా భూమిలో సుమారు 343 ఎకరాల 37 గుంటల స్థలాన్ని సేకరించేందుకు నోటిఫికేషన్ జారీచేసి ప్రక్రియ మొదలుపెట్టింది. అందులో భాగంగా క్షేత్రస్థాయిలో రికార్డుల ప్రకారం భూసేకరణ కార్యక్రమాలు చేపట్టాల్సిన రెవెన్యూ యంత్రాంగం అర్హులను అనర్హులుగా, అనర్హులను అర్హులుగా గుర్తిస్తూ ప్రతిపాదించారన్న ఆరోపణలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి ప్రభుత్వ భూమిలో పంట సాగుచేసుకునే లబ్దిదారులను గుర్తించడంతోపాటు లావుని పట్టాదారులు, పిఓటి చట్టం ద్వారా స్వాధీనం చేసుకున్న భూమికి సంబంధించిన రికార్డులను తారుమారు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పట్టాదారులకు సైతం పరిహారం చెల్లించేందుకు రంగం సిద్ధం చేసే ప్రక్రియలో అసలు పట్టాదారులను కాదని మూడవ వ్యక్తికి లబ్ధి చేకూర్చేలా స్థానిక రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2005-06 సంవత్సరంలో భూముల వ్యాపారం జోరుగా కొనసాగుతున్న తరుణంలో ఒకటికి రెండు చేతులు మారి డబుల్ రిజిస్ట్రేషన్‌లు కూడా జరిగినా రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేసుకోలేని వారికి భారీగానే నష్టం జరుగుతుందని అంచనా. రెండవ దఫా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారే తమ పలుకుబడిని ఉపయోగించి రెవెన్యూ రికార్డుల్లో మొటేషన్ చేయించుకున్నారని కొందరు, తాము కబ్జాలో ఉన్న ఇతరుల పేర్లు నమోదు చేయించుకొని పరిహారం తీసుకుంటున్నారని మరికొందరు, వాస్తవాలను నిలదీస్తే కనీసం తహసీల్ కార్యాలయంలోకి కూడా రానివ్వడం లేదని ఇంకొందరు రెవెన్యూ యంత్రాంగం తీరుపై మండిపడుతున్నారు.
ఇదిలా ఉండగా సర్వే నెంబరు 288/1టి లో నాలుగు ఎకరాల 20 గుంటల స్థలానికి సంబంధించి రికార్డులు తారుమారు అయ్యాయని, అలాగే భూ యాజమాన్య హక్కుల కోసం కోర్టులో విచారణ జరుగుతుండగానే మరొకరికి పరిహారం చెల్లించేందుకు రికార్డులు సృష్టిస్తున్నారన్న పుకార్లు గ్రామస్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
విచారణ జరిపిస్తా:కలెక్టర్ హామీ
రంగారెడ్డి జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఫార్మాసిటీ భూసేకరణలో అవకతవకలు జరగుతున్నాయన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించి, చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రఘునందన్‌రావు తెలిపారు.