తెలంగాణ

పాలించలేకే ముందస్తుకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, అక్టోబర్ 1: రాష్ట్ర ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక, పరిపాలన సక్రమంగా అందించలేకనే రాష్ట్ర అపద్ధర్మ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని రాష్ట్ర శాసనసభ కాంగ్రెస్ పక్ష మాజీ నాయకులు కుందూరు జానారెడ్డి ఆరోపించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సోమవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2 లక్షల డబుల్‌బెడ్ రూం ఇళ్లు నిర్మిస్తానని చెప్పి 15,000 కూడా నిర్మించలేదని, అదే విధంగా దళితులకు మూడెకరాల వంటి హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ఎకరం ఉన్న 15 లక్షల మంది, రెండెకరాలున్న 4 లక్షల మంది రైతులకే రైతుబంధు కింద పెట్టుబడి మొత్తాన్నిచ్చారని, మిగిలినవి పెద్ద రైతులకు ఇవ్వడం జరిగిందని ఆరోపించారు. ప్రధాని మోదీతో, రాష్ట్రంలో ఎంఐఎంతో కుమ్మక్కయిన కేసీఆర్ ఎన్నికలకు వెళ్లే ధైర్యం చేశాడని ఆరోపించారు. ముందస్తుగా ఎన్నికలకు వెళ్తున్న కేసీఆర్ దుష్టపాలనకు చరమగీతం పాడాలని కోరారు. కేవలం దుష్ప్రచారంతోనే కేసీఆర్ అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు కూడా వద్దామనుకుంటున్నారని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను అవలంభిస్త్తున్న కేసీఆర్‌ను గద్దె దింపాల్సిన అవసరం ఉందన్నారు. మిర్యాలగూడ శాసనసభ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేసినా మేరెవరు పోటీ చేసినా కాంగ్రెస్ అభ్యర్ధిని గెలిపించాల్సిందేనని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువస్తామని ఆ యన ధీమాగా చెప్పారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎల్‌పీ మాజీ నేత జానారెడ్డి