తెలంగాణ

సమస్యాత్మక జిల్లాలపై డేగకన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, అక్టోబర్ 1: ముందస్తు ఎన్నికల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. విశాఖ జిల్లా అరుకు సంఘటనతో తెలుగు రాష్ట్రాలలో మావోల కదలికలు ఉన్నాయనే ఇంటిలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో పోలీసులు ముందస్తు భద్రత చర్యలు చేపట్టారు. అందులో భాగంగా తెలంగాణలోని పలు సమస్యాత్మక జిల్లాలను గుర్తించారు. సోమవారం రాష్ట్ర డీజీపీ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా జయశంకర్‌భూపాలపల్లి జిల్లాకు చేరుకొన్నారు. గణపురం మండలంలోని కేటీపీపీ(జెన్‌కో)లోని గోదావరి గెస్ట్‌హౌస్‌లో పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. సమావేశంలో రామగుండం కమిషనరేట్, ఆసీఫాబాద్ జిల్లా, రామగుండం జిల్లా, మహుబూబాద్ జిల్లాల పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసులకు భద్రత ఏర్పాట్లపై దిశానిర్ధేశం చేశారు. రానున్న మూడు నెలల కాలంలో పకడ్భందీగా భద్రత చర్యలు చేపట్టి ఎన్నికల సందర్భంగా ఎలాంటి హింసాత్మక సంఘటనలకు తావులేకుండా గట్టి భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లోకల్ పోలీసులతో కలిసి గ్రేహౌండ్స్, స్పెషల్ పోలీసులు, పారామిలటరీ దళాలు సమష్టిగా పనిచేసి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చూడాలని అన్నారు. ప్రజల సహకారంతో శాంతి భద్రతలు పర్యవేక్షించాలని పోలీస్ బాస్ ఆదేశించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రశాంతంగా ఉందని, ఎన్నికలు అయ్యేంతవరకు కూడా ఏ ఒక్క సంఘటన జరగదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా ఎస్పీ ఆర్. భాస్కరన్ జిల్లాలో చేపడుతున్న భద్రత ఏర్పాట్లను డీజీపీకి వివరించారు. నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి, ఇంటిలిజెన్స్ ఐజీ నవీన్‌చంద్, ఇంటిలిజెన్స్ డీఐజీ ప్రభాకర్‌రావు, కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రసాద్‌కుమార్, రామగుండం కమిషనర్ సత్యనారాయణ, ఆసీఫాబాద్ ఎస్పీ మల్లారెడ్డి, మహబూబాబాద్ ఎస్పీ కోటి రెడ్డి, పెద్దపల్లి, మంచిర్యాల డీసీపీలు సుదర్శన్ గౌడ్, వేణుగోపాల్‌రావు, భూపాలపల్లి జిల్లా అధనపు ఎస్పీ రాజమహేంద్రనాయక్ పాల్గొన్నారు. \

చిత్రం..సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న డీజీపీ మహేందర్‌రెడ్డి