తెలంగాణ

బీసీలకు 50 శాతం సీట్లివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 2: ముందస్తు ఎన్నికల్లో బీసీలకు 50 శాతం టిక్కెట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు. ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు గుజ్జ కృష్ణ, వేముల రామకృష్ణ, బర్క కృష్ణ, రాజ్‌కుమార్, అంజి, అశోక్ ప్రభృతులు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సీ కుంతియాను, టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్‌లో ఉన్న బలమైన బీసీ నాయకులకు సీట్లు కేటాయించాలని, మహాకూటమి ఏర్పాటుతో బీసీలకు అన్యాయం చేయరాదని వారు కోరారు. రూ.20 వేల కోట్లతో బీసీ సబ్-ప్లాన్ ఏర్పాటు చేయాలని, బీసీ కార్పొరేషన్, బీసీ ఫెడరేషన్‌ల ద్వారా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ 50 శాతం సబ్సిడీ రుణాలు ఇవ్వాలని, బీసీల విద్యా, ఉద్యోగాల రిజర్వేషన్లను 25 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని, బీసీ విద్యార్థులకు ర్యాంకులతో సంబంధం లేకుండా పూర్తి ఫీజుల రీయంబర్స్‌మెంట్ ఇవ్వాలని, బీసీ విద్యార్థులకు 500ల రెసిడెన్షియల్ పాఠశాలలు, వంద బీసీ డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలలను మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. బీసీల విద్య, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్‌ను తొలగించాలని, బీసీలకు పారిశ్రామిక పాలసీలో 50 శాతం కోటా ఇవ్వాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను, 50 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇలాఉండగా కుంతియా, ఉత్తమ్ స్పందిస్తూ మిగతా పార్టీల కంటే తాము బీసీలకు ఎక్కువ సీట్లు ఇస్తామని హామీ ఇచ్చినట్లు కృష్ణయ్య తెలిపారు.