తెలంగాణ

ఆ మూడు నియోజకవర్గాల్లో ఆదివాసీలకే అధికారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,అక్టోబర్ 2: ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని ఆసిఫాబాద్, బోథ్, ఖానాపూర్ ఎస్టీ నియోజకవర్గాల్లో ఆదివాసీలు ఈ ఎన్నికల్లో రాజకీయ ఆధిపత్యం చాటుకునే రీతిలో తుడుం మోగించి మూడు సీట్లను కైవసం చేసుకోవాలని, ఇందుకోసం సంఘటితంగా ఎన్నికల ఉద్యమానికి ఆదివాసీలు సిద్దం కావాలని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సోయం బాపురావు పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని డైట్ మైదానంలో ఆదివాసీ తొమ్మిది తెగల నాయకులు కలిసి బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా తొమ్మిది ఆదివాసీ తెగలకు చెందిన వేలాది మంది పాల్గొన్నారు. ఈ సంధర్భంగా సోయం బాపురావు మాట్లాడుతూ రాజ్యాంగబద్దంగా అసలైన ఆదివాసీలకు అందాల్సిన న్యాయమైన హక్కులను వలస లంబాడాలు అక్రమంగా పొందుతున్నారని అన్నారు. దీంతో ఆదివాసీ తెగలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మరింత వెనకబడిపోతున్నారని అన్నారు. ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయంపై 11 నెలలుగా పోరాటం చేస్తుంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వం స్పందించకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్ళిందన్నారు. ఆదివాసీల్లోని తొమ్మిది తెగలు కలిసికట్టుగా ఉండి ఆదివాసీ నాయకులకే మద్దతు తెలిపి ఎన్నికల్లో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బోథ్, ఖానాపూర్, ఆసిఫబాద్‌లలో ఆదివాసీ తెగలు ఎక్కువగా ఉన్నారని, ఇక్కడ ఆదివాసీ టికెట్లు ఇచ్చే పార్టీలకు మద్దతు తెలుపాలని సూచించారు. ఆదివాసీ నాయకులకు టికెట్లు ఇవ్వకపోతే తుడుం దెబ్బ తరపున పోటీచేసే ఆదివాసీ నాయకులను గెలిపించి తుడుందెబ్బ సత్తాచాటాలన్నారు. బోథ్ నియోజకవర్గం నుంచి తనకు కాంగ్రెస్ తరపున టికెట్ వస్తుందని, ఒకవేళ వారు ఇవ్వకపోతే తానుకూడా బోథ్ నుంచి తుడుం దెబ్బ మోగిస్తానని స్పష్టం చేశారు. ఏ పార్టీ నుంచి పోటీచేసినా ఆదివాసీ జాతి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 ఆదివాసీ తెగల నియోజకవర్గాలున్నాయని, అన్నింటిలోనూ తమ నాయకులను గెలిపించుకోవాలన్నారు. ఆదివాసీ తెగలు ఐక్యంగా ఉండి పోరాటం చేస్తేనే న్యాయమైన హక్కులు సాధించుకోవచ్చన్నారు. ఆదివాసీ పోరాటం వల్లే గతంలో కాంగ్రెస్ పోడు భూములకు పట్టాలిచ్చిందన్నారు. తాజాగా ఆదివాసీ హక్కుల కోసం 11 నెలలుగా సాగిన పోరాటం వల్ల తెరాస ప్రభుత్వం ఐటిడి ఏలను ఎత్తివేసే ప్రయత్నాన్ని విరమించుకుందన్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో ఉద్యమానికి కొంత విరామం ఇచ్చామని, ఎన్నికలు అయిపోగానే ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి ఆదిలాబాద్ నుంచే ఆదివాసీల తుడుం దెబ్బన్న దేశవ్యాప్తంగా చాటుతామన్నారు. తెరాస ప్రభుత్వం ఆదివాసీల న్యాయమైన సమస్యను పరిష్కరించలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల పుస్తకాలు చదివిన ముఖ్యమంత్రి కెసి ఆర్ ఆదివాసీల చరిత్రను ఎందుకు చదువలేదని ప్రశ్నించారు. చరిత్ర చదివి ఉంటే ఇప్పటికే తమ సమస్యలు పరిష్కారమయ్యేవని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐటిడి ఏ చైర్మెన్ కనక లక్కెరావు మాట్లాడుతూ ఆదివాసీ తెగలు ఐక్యంగా ఉండి జాతికి జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేసి సమస్యలు పరిష్కరించుకున్నట్లయితే ఆదివాసీలు అన్ని రంగాల్లో అభివృద్ది చెందే అవకాశం ఉంటుందన్నారు. ఈకార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మడావి రాజు, కొడప నగేష్, దుర్వ నగేష్, విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపురావు