తెలంగాణ

టీడీపీకి పూర్వ వైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 2: తెలంగాణలో టీటీడీపీకి పూర్వవైభవం వస్తుందని పార్టీ ప్రధానకార్యదర్శి ఇ.పెద్దిరెడ్డి, పోలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, జాతీయ పార్టీ అధికార ప్రతినిధి అరవింద్ కుమార్‌గౌడ్‌లు పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మహాత్మాగాంధీ, లాల్‌బహుదూర్ శాస్ర్తీ జయంతి కార్యక్రమాల్లో వారు మాట్లాడుతూ తెలంగాణ సీఎం ఎన్నడూ ప్రజల్లో లేరని, సంవత్సరం తర్వాత రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఎవరు అని ప్రశ్నిస్తే ప్రజలకు గుర్తుకు వచ్చే పరిస్థితి లేదని వారు ఎద్దేవా చేశా రు. దళితుడ్ని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన కేసీఆర్ తానే సీఎం అయ్యారని, ఏ ఒక్క హామీనీ నెరవేర్చకుండానే మళ్లీ ఆశీర్వదించమని కోరుతూ ఎన్నికలకు వెళ్తున్నారని ఆయన విమర్శించారు. కొద్ది మంది ప్రయోజనాలకే టీఆర్‌ఎస్ పనిచేస్తోందని, మహాత్మాగాంధీ ఆశయాలను మరచి గడీల పాలనకు శ్రీకారం చుట్టినందుకు ప్రజలు ఓటు అనే ఆయుధంతో టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలని అన్నారు. చంద్రబాబునాయుడు పాలనలో ప్రజలను భాగస్వామ్యులను చేశారని, ఇపుడు ఆయన మార్గనిర్దేశంలో మనో నిబ్బరంతో ముందుకు వెళ్తామని, పార్టీకి పూర్వవైభవం తెస్తామని రావుల చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు.