తెలంగాణ

అధికారం చేపట్టిన తొలి ఏడాది లక్ష ఉద్యోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 3: అధికారం చేపట్టిన తొలి ఏడాది లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్, టీడీపీ నేతృత్వంలోని మహాకూటమి నేతలు హామీ ఇచ్చారు. బుధవారం కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టివిక్రమార్క, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు, తెలంగాణ జన సమితి పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ తదితరులు సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. మహాకూటమి అధికారంలోకి రాగానే నీటి పారుదల ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని, పంటల భీమా అమలు చేయాలని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. సమావేశానంతరం భట్టివిక్రమార్క మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అమర వీరుల ఆత్మకు శాంతి చేకూరేలా తమ కూటమి మ్యానిఫెస్టొ ఉంటుందన్నారు. మహాకూటమి పేరు మార్చాలన్న ఆలోచన చేసినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ పరిరక్షణ వేదికగా మార్పు చేయాలన్న అభిప్రాయం కూడా వచ్చిందన్నారు. మొత్తం నాలుగు ప్రతిపాదనలు వచ్చాయని, వీటిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. సీట్ల సర్దుబాటు కూడా సాఫీగా జరుగుతుందన్నారు. ఒకటి, రెండు రోజుల్లో స్పష్టం చేస్తామని ఆయన తెలిపారు.