తెలంగాణ

40 భారీ సమ్మేళనాలు 20 యువ సమ్మేళనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 3: ముందస్తు ఎన్నికలకు ముందస్తుగానే సిద్ధమైన బీజేపీ ప్రచారంలో భాగంగా 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారీ సమ్మేళనాలు నిర్వహించనుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో యువ ఓటర్లతో సమ్మేళనాలు, ఓబీసీ సదస్సులు నిర్వహించనుంది. 40 అసెంబ్లీ స్థానాల్లో భారీ ఎత్తున ఈ సమ్మేళనాలు నిర్వహిస్తారు. మరో 31 చోట్ల యువ సమ్మేళనాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఇంకో పక్క ఎన్నికల ఇన్‌చార్జి సంతోష్ నేతృత్వంలోని ఎన్నికల యాజమాన్య కమిటీ భేటీని బీజేపీ బుధవారం నాడు నిర్వహించింది. ప్రభుత్వ వైఫల్యాలపై అంశాల వారీగా నివేదికలను రూపొందిస్తున్నారు. ఈ నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒక చార్జిషీట్‌ను విడుదల చేయనుంది. ఈ చార్జిషీట్ కమిటీకి చింతల రామచంద్రారెడ్డి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. వైస్ చైర్మన్‌గా సంకినేని వెంకటేశ్వరరావు, కన్వీనర్‌గా డాక్టర్ మనోహర్‌రెడ్డి కొనసాగుతున్నారు. మరో పక్క ఎన్నికల ప్రణాళిక కమిటీకి చైర్మన్‌గా ఎన్ వీ ఎస్ ఎస్ ప్రభాకర్‌ను నియమించారు. ఈ కమిటీ ఇప్పటికే ఎన్నికల ప్రణాళిక ముసాయిదాను తయారుచేసింది. మహానగరాలు మినహా మిగిలిన చోట్ల ఆరు రూపాయిలకే తాగునీరు అందించాలనే నిర్ణయంపై తీవ్రమైన ప్రతిస్పందన వచ్చింది. పార్టీ కార్యాలయంలో వరుసగా నియోజకవర్గాల వారీ ప్రజాభిప్రాయాన్ని, నాయకుల అభిప్రాయాన్ని సేకరించి, ప్రజాస్వామ్య పద్ధతిలో గెలుపుగుర్రాలనే గుర్తించాలనే ప్రయత్నంలో బీజేపీ నేతల్లో ఉన్న ముసలం బయటపడుతోంది. నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల నియోజకవర్గాల నేతలతో బుధవారం నాడు సమావేశం జరిగింది. పార్టీ బలాబలాలు, పనితీరు, అభ్యర్ధులు ఎవరైతే బావుంటుందనే చర్చ జరిగింది. కొంత మంది బహిరంగంగా తమ మనసులో భావాలను చెప్పలేకపోతే రాసివ్వమని కూడా రాష్ట్ర నాయకులు సూచించారు. అయితే బయటకు వచ్చిన తర్వాత ఆయా జిల్లాల నేతల్లో విబేధాలు పొడసూపాయి. సమావేశంలో మాట్లాడిన తీరును మిగిలిన నేతలు తప్పుపట్టారు.కొన్ని నియోజకవర్గాల విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తమైనా, మరికొన్ని చోట్ల అభ్యర్ధుల ఎంపికపై విబేధాలు ఏర్పడ్డాయి. లోపల ఒక మాట, బయట ఒక మాట చెప్పడంపై స్థానిక నాయకులపైనా అరుపులు కేకలు వేయడంతో రాష్ట్ర కార్యాలయం ఒక్కసారిగా వేడెక్కిపోయింది.
వివిధ జిల్లాల నేతలతో రాష్ట్ర కార్యాలయం ఉక్కిరిబిక్కిరి అయింది. అభిప్రాయ సేకరణ సమావేశంలో సతీష్‌తో పాటు కృష్ణదాస్, డాక్టర్ కే లక్ష్మణ్, జి కిషన్‌రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు. ఈ నెల 10వ తేదీన అమిత్ షా హాజరయ్యే కరీంనగర్ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్ సభకు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ అధ్యక్షత వహిస్తారు. రాష్ట్ర , జాతీయ నాయకులు అంతా ఈ సభలో పాల్గొంటారు. సభానంతరం భారీ ఎత్తున ఒకే రోజు చేరికలు నిర్వహించి పార్టీని ఎన్నికల రణరంగంలోకి దించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.
రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా నడ్డా
తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా పార్టీ కేంద్ర కమిటీ జగత్ ప్రకాష్ నడ్డాను నియమించింది.