తెలంగాణ

తెలంగాణలో ‘అన్న’ క్యాంటీన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 3: తెలంగాణలో అన్న క్యాంటీన్లు ప్రారంభించే యోచన ఉందని టీటీడీపీ ప్రధాన కార్యదర్శి బండ్రు శోభారాణి పేర్కొన్నారు. బుధవారం నాడు ఎన్టీఆర్ భవన్‌లో పోలిట్‌బ్యూరో సభ్యులు టీ దేవేందర్ గౌడ్ అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ మూడో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పోలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, జాతీయ పార్టీ ప్రధానకార్యదర్శి ఇ పెద్దిరెడ్డి, జాతీయ పార్టీ క్రమశిక్షణా కమిటీ సభ్యుడు బక్కని నర్సింహులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు, రాష్ట్ర పార్టీ ప్రధానకార్యదర్శి జీ బుచ్చిలింగం పాల్గొన్నారు. ప్రతి అంశాన్ని కూలంకుషంగా చర్చించి ప్రజలకు మేలు చేసే విధంగా మేనిఫెస్టో రూపొందించాలని భావించారు. చాకలి ఐలమ్మ పేరుతో మహిళా సాధికారత కార్యక్రమాలు, కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో శిక్షణ కేంద్రాలు, ప్రొఫెసర్ జయశంకర్ పేరు మీద విద్యకు సంబంధించిన కార్యక్రమాలు, కాళోజీ, దాశరథి రంగాచార్యల పేర్లు మీద సాహిత్య పురస్కారాలు అందించాలనే ప్రతిపాదనలు వచ్చాయి. ఎన్టీఆర్ పేరుతో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా వచ్చిందని బండ్రు శోభారాణి చెప్పారు. అమరుల కుటుంబాలను ఆదుకోవడం మొదటి ప్రాధాన్యతగా ఉంటుందని, అమరులకు స్మృతి చిహ్నాన్ని ఏర్పాటు చేయడం కూడా ఈ ప్రతిపాదనల్లో ఉందని అన్నారు. వీటన్నింటిపైనా సమగ్రంగా చర్చించి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను అందుకునే విధంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో రూపొందిస్తుందని చెప్పారు.