తెలంగాణ

సమర్థుడైన నాయకుడు జానారెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 3: దశాబ్ద కాలం అన్ని పదవులను సమర్ధవంతగా నిర్వహించిన వ్యక్తి సీఎల్‌పీ మాజీ నాయకుడు కుందూరు జానారెడ్డి అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. జానారెడ్డి జీవిత చరిత్రను సీనియర్ జర్నలిస్ట్ టీ.సురేందర్ ‘అజాత శత్రువు’ అనే పేరుతో రచించిన పుస్తకాన్ని ఉత్తమ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బుధవారం ఇందిరా భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణకు మారు పేరుగా నిలిచి నిజాయితీ, నిస్వార్థంతో సమర్ధవంతంగా విధులను నిర్వహించిన వ్యక్తి జానారెడ్డి అని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో మండలాల వ్యవస్థను ఏర్పాటుకు ఎన్టీరామారావుతో కలిసి కృషి చేసిన వ్యక్తిగా పేరు సంపాందించారని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జానారెడ్డిని గుర్తుపట్టని వ్యక్తి లేడని, ఎన్టీరామారావు, వైఎస్.రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా, సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేగా పని చేసిన అపార అనుభవం కలిగిన వ్యక్తి అని అభినందించారు. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో సుదీర్గకాలం మంత్రి పదవులు నిర్వహించిన జానారెడ్డి సీఎల్పీ నాయకుడిగా పని చేసి అందరి మన్ననలు పొందారని అన్నారు. వివిధ మంత్రిత్వ శాఖల్లో పని చేసిన జానా ఆయా శాఖల్లో సమూల మార్పులు తెచ్చి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పాటుపడ్డాడని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కే. రోశయ్య, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, షబ్బీర్ అలీ, సమర సింహారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ తదితరులు ప్రసంగించారు.