తెలంగాణ

నాలుగు కోట్ల ప్రజల తెలంగాణ ఆ నలుగురి గుప్పిట్లోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, అక్టోబర్ 4: నాలుగు కోట్ల తెలంగాణ రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబంలోని ఆ నలుగురే గుప్పిట్లో పెట్టుకొని ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అగౌరవ పర్చేందుకే ప్రాధాన్యం ఇస్తోందని మాజీ సీఎల్పీ ఉపనేత తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. గురువారం జగిత్యాలలోని దేవిశ్రీ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ఆత్మత్యాగాలు, బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఓ నియంత, అరాచక పాలన సాగుతోందని అన్నారు. రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబం కబంధ హస్తాల్లో నలిగిపోతోందన్నారు. నాలుగు కోట్ల ప్రజలకు కల్వకుంట్ల కుటుంబం నుంచి విముక్తి కల్పించేందుకే మహాకూటమి ఏర్పడిందన్నారు. టీడీపీ - కాంగ్రెస్ పొత్తు కలిస్తే నీకెందుకు గుబులో అని ప్రశ్నించారు. మహాకూటమి ఏర్పాటుతో ఓటమి తప్పదని భయం పట్టుకున్న కల్వకుంట్ల కుటుంబం పని గట్టుకొని ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను అగౌరవ పరిచేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. అధికారంలో ఉన్న నాలుగేళ్లలో ఏం చేశావని చెప్పే పరిస్థితిలేకే ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోయడమే నీ ఎన్నికల ప్రణాళికా అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. మున్సిపాలిటీకి విడుదలైన నిధులు కేటాయింపులపై టీఆర్‌ఎస్ పార్టీ ప్రమేయం ఏంటో అర్థం కాలేదని, మరి జిల్లా కలెక్టర్ ఏమైనా అధికారాలు బదలాయించారో ఏమో అని ఎద్దేవా చేశారు. ఈ విషయమై కలెక్టర్ స్పష్టత ఇవ్వాలని, కమిటీలో లేని వ్యక్తికి పనుల గుర్తింపు బాధ్యత ఎవరు కట్టబెట్టారన్నారు. ఎమ్మెల్యే ప్రపోజల్‌తో విడుదలైన నిధుల తానే చేశానని చెప్పుకుంటూ తన పేర ప్రొసీడింగ్‌లు పంపిణీ చేయడం ఎమ్మెల్యేను స్థానిక టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి అవమానించడం ఇది ప్రజలను అవమానించినట్లు కాదా..అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు.