తెలంగాణ

ప్రశ్నిస్తే దాడులు చేస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నశంకరంపేట: రాజకీయాలు మానాలి, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలు రావాలని టీజేఎస్ అధ్యక్షులు, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో కొల్కురి జానమ్మ అంత్యక్రియలకు హాజరైన అనంతరం స్థానిక బస్టాండ్ వద్ద విలేఖరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష ఎంత ముఖ్యమో తెలంగాణ వస్తే నిధులు, నీళ్లు, నియామకాలు వస్తాయని ఆశించిన ప్రజలు తెలంగాణలో ఇవి అమలు కాలేవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ రీ డైజన్ చేస్తే 40 వేల కోట్లు మిగులుతాయని, వీటితో రాష్ట్రంలో డబుల్ బెడ్‌రూమ్‌లు నిర్మించవచ్చన్నారు. ప్రజల కోసం ప్రభుత్వం పనిచేయాలే తప్పా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనులతో కాంట్రాక్ట్‌ల జేబులు నిండుతున్నాయన్నారు. ప్రతి పైసా ప్రజలకు చెందాలన్నారు. ఓటుతో పాలకులను ప్రశ్నించే వ్యవస్థ కోసం పార్టీ ఏర్పాటు చేసినట్లు కోదండరాం తెలిపారు. ప్రభుత్వం ప్రజల కోసం జవాబుదారితనంగా పనిచేసి ప్రజల బాగోగులు పట్టించుకోవాలన్నారు. రాజకీయాల్లో ప్రజలు కోరుకున్న విధంగా పాలన సాగించేందుకు టీజేఎస్ పార్టీని ఏర్పాటు చేశామన్నారు. మార్పు తప్పకుండా సాధించి తీరుతామన్నారు. ఖచ్చితంగా కేసీఆర్ ఓడిపోవడం ఖాయమన్నారు. వచ్చే ఎన్నికల్లో తెరాస పార్టీ దుకాణం బంద్ అవుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కనకయ్య, దుబ్బాక నియోజకవర్గ ఇన్‌చార్జి రాజ్‌కుమార్ పాల్గొన్నారు.