తెలంగాణ

పోలింగ్ రోజు అమావాస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 6: ముందస్తు ఎన్నికల తేదీ (షెడ్యూలు) అన్ని పార్టీల నేతల గుండెల్లో గుబులు పుట్టించింది. కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఇసీ) ప్రధాన కమిషనర్ రావత్ తెలంగాణలో డిసెంబర్ 7న ఎన్నికలు నిర్వహిస్తామని శనివారం ప్రకటించారు. తేదీ ప్రకటించడంతోనే అన్నీ పార్టీల నేతలు హుషారుగా తెలుగు క్యాలెండర్‌లు, పంచాంగాలు చూసి నివ్వెరపోయారు. ఎందుకంటే పోలింగ్ రోజున మధ్యాహ్నం వరకూ అమావాస్య ఉంది. సాధారణంగా అమావాస్య రోజున ఎవరూ కొత్త పనులు, శభకార్యాలు చేయరు. కానీ పోలింగ్ రోజునే అమావాస్య ఉండడంతో వారు హతాశులయ్యారు. పోలింగ్‌కు ముందు రోజున అంటే డిసెంబర్ 6న అమావాస్య ప్రారంభమై, 7వ తేదీ మధ్యాహ్నం 12.50 గంటల వరకూ అమావాస్య ఉంటుంది. చేయగలిగిందేమీ లేదని అన్ని పార్టీల నాయకులూ అంటున్నారు. అయితే అమావాస్య రోజున ఎవరికి అనుకూలంగా, ప్రతికూలంగా ఉంటుందోనన్న భయం వారికి లేకపోలేదు.
గత నెల 6న అసెంబ్లీ రద్దయితే, సరిగ్గా నెల రోజులకు కొత్త షెడ్యూలు ప్రకటించారు. కేసీఆర్ అదృష్ట సంఖ్య 6 అనే విషయం అందరికీ తెలిసిందే. గత నెల 6న అసెంబ్లీని రద్దు చేస్తే, మళ్ళీ 6నే షెడ్యూలు ప్రకటన వచ్చింది. అదృష్ట సంఖ్య రోజున ఎన్నికల షెడ్యూలు ప్రకటించినందున తమకు అన్ని విధాలా కలిసి వస్తుందన్న ధీమాను టీఆర్‌ఎస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 6న పోలింగ్ పెడితే ఇంకా బాగా ఉండేదునుకున్నా, ఆ రోజున బాబ్ళీ మసీదసు కూల్చి వేసన సంఘటన రోజు కాబట్టి మైనారిటీలు నిరసన ర్యాలీతో బీజీగా ఉంటారు కాబట్టి సీఇసీ 7న ప్రకటించి మంచి పని చేసిందని వారు భావిస్తున్నారు. ఇలాఉండగా కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూలును చూస్తే కేసీఆర్‌కు ఏ మాత్రం ఈ ఎన్నికలు కలిసి రావని స్పష్టమైందని ఆయన తెలిపారు.
డిసెంబర్‌లో సీఎంలు అయ్యింది వీరే
లోగడ డిసెంబర్ నెలలో పలువురు ముఖ్యమంత్రులుగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1973వ సంవత్సరం డిసెంబర్ 10న జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1989 డిసెంబర్ 3న మర్రి చెన్నారెడ్డి, 1990 డిసెంబర్ 7న నేదురుమల్లి జనార్థన్ రెడ్డి, 1994 డిసెంబర్ 12న ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
ఇప్పుడు జరగనున్న ముందస్తు ఎన్నికల ఫలితాలు డిసెంబర్‌లో రావడం, అదే నెలలో కొత్త ప్రభుత్వం కొలువ తీరడం జరగాల్సి ఉంటుంది. అయితే ఆ అదృష్టం ఏ పార్టీ నేతనో వరిస్తుందోనన్న చర్చ జరుగుతున్నది.