తెలంగాణ

అందితే జుట్టు, లేకపోతే కాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 6: తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతున్న తీరును చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని టీటీడీపీ ప్రధాన కార్యదర్శి బండ్రు శోభారాణి వ్యాఖ్యానించారు. గత మూడు బహిరంగ సభల్లో కేసీర్ మాట్లాడిన తీరు, వాడిన పదజాలం చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ నైజం అందరికీ తెలిసిందేనని, అందితే జుట్టు, లేకపోతే కాళ్లు అనే పద్ధతి ఎప్పటి నుండో చూస్తున్నదేనని చెప్పారు. టీడీపీ బలం 0.2 శాతం కూడా లేదని చెబుతూనే పదే పదే చంద్రబాబు పేరు, టీడీపీ పేరు ఎందుకు ప్రస్తావిస్తున్నారో అర్ధం కావడం లేదని అన్నారు. రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాల్సిన కేసీఆర్ వాడిన భాషను ఏ మహిళ అయినా సిగ్గుపడుతున్నారని , బాధపడుతున్నారని ఆమె చెప్పారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్ర ముఖ్యమంత్రిని వాడు వీడు అని సంబోధించడం సబబేనా అని నిలదీశారు. తాము మాట్లాడటం ప్రారంభిస్తే కేసీఆర్ బతుకెంత అని ఆమె ప్రశ్నించారు. కేసీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరూ ఊరుకోరని, తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ అవసరం లేదని కేసీఆర్ అంటున్నారని, ఎందుకు అవసరం ఉండదని ఆమె నిలదీశారు. తెలంగాణ ఏమైనా కేసీఆర్ అయ్య జాగీరా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే డీకే అరుణని ఒక మహిళ అని చూడకుండా ఒళ్లు దగ్గరపెట్టుకో అని మాట్లాడటం దారుణమని అన్నారు. ఓటమి భయంతో కేసీఆర్ మాట్లాడుతున్నారని, కనీసం మిగిలిన నాయకులను చూసి సంస్కారం నేర్చుకోవాలని అన్నారు. గడీల పాలన దించడానికే మహాకూటమి ఏర్పడిందని అన్నారు. కేసీఆర్ సభలు ఆశీర్వాద సభల్లా లేవని, కేసీఆర్ ఏడుపుగొట్టు సభల్లా ఉన్నాయని అన్నారు.