తెలంగాణ

పరీక్ష కేంద్రాల గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 6: గురుకులాల టీజీటీ, పీజీటీ పోస్టుల ఎంపికకు నిర్వహించిన పరీక్ష అభ్యర్ధులకు చుక్కలు చూపించింది. కొంత మంది అభ్యర్ధులకు పరీక్ష కేంద్రాలు తప్పుగా ఇవ్వడంతో గందరగోళానికి గురయ్యారు. శనివారం నాడు నిర్వహించిన పేపర్-1కు 83,846 మంది రిజిస్టర్ చేసుకోగా, 56116 మంది అభ్యర్ధులు పరీక్షకు హాజరయ్యారు. అభ్యర్ధులు ఒకరికి బదులు మరో అభ్యర్ధి పరీక్ష రాసేందుకు అవకాశం లేకుండా పరీక్ష కేంద్రాల వద్ద ఎంపిక బోర్డు బయోమెట్రిక్ మిషన్లను వినియోగించింది. అయితే ఎక్కడా ఎలాంటి అక్రమాలు జరగలేదని ఎంపిక బోర్డు చైర్మన్ డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. పరీక్ష ప్రశాంతగా, సజావుగా సాగిందని అన్నారు. ప్రభుత్వం నుండి అనుమతి రాగానే అతి స్వల్ప వ్యవధిలోనే పరీక్షకు ఏర్పాట్లు చేయగలిగామని చెప్పారు. పేపర్ -1తో పాటు పేపర్ 2 పరీక్షలు మొత్తం అన్ని సబ్జెక్టులు కలిపి అక్టోబర్ 24 నాటికి పూర్తవుతాయని ఆయన చెప్పారు.