తెలంగాణ

అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాలకోసం రూ. 36 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 6: రాష్ట్రంలోని దేవాలయాల్లో పనిచేసే అర్చకులు, ఆలయ ఉద్యోగులకు 2018-19 సంవత్సరానికి సంబంధించి రెండు, మూడో త్రైమాసికాల కోసం వేతనాలు చెల్లించేందుకు 35.95 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు రెవెన్యూ (ఎండోమెంట్స్) ముఖ్యకార్యదర్శి ఎన్. శివశంకర్ పేరుతో శనివారం ఉత్తర్వులు (జీఓ ఆర్‌టి 449) జారీ అయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో అర్చకులు, ఆలయ ఉద్యోగుల వేతనాలు, ఇతర ఖర్చులకోసం 71.90 కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించారు. ఈ మొత్తంలో 2018 ఏప్రిల్-జూన్ నెలలకు అవసరమైన 17,97,50,000 రూపాయలను ఇప్పటికే విడుదల చేశారు. ప్రస్తుతం విడుదల చేసిన నిధులు జూలై-డిసెంబర్ నెలలకు సరిపోతాయి. 2019 మొదటి మూడునెలలకు అవసరమైన నిధులను తర్వాత విడుదల చేస్తారు.