తెలంగాణ

సమ్మతించిన నేతలు దారికొస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 12: తెలంగాణ రాష్ట్ర సమితి ప్రకటించిన అభ్యర్థులపై రేగిన అసమ్మతి సెగలు దాదాపు సద్దుమణిగినట్టే కనిపిస్తోంది. అయితే అధిష్ఠానం బుజ్జగింపుతో చల్లబడిన నేతలు సహకరిస్తారా? లేదా? అనే అనుమానాలు అభ్యర్థుల్లో ఇంకా వ్యక్తమవుతూనే ఉన్నాయి. అధిష్ఠానం బుజ్జగింపులకు సమ్మతించిన నేతలు అభ్యర్థులకు ఎంతమేరకు సహకరిస్తున్నదీ లేనిదీ నిఘా వర్గాలు, పార్టీ వేగుల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటోంది. అధిష్ఠానం ఆదేశంతో మొక్కుబడిగా ప్రచారంలో పాల్గొంటున్న అసమ్మతి నేతలను ఓ కంట కనిపెడుతూనే ఉంది. స్టేషన్ ఘనపూర్ టికెట్ ఆశించిన ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, టికెట్ దక్కించుకున్న తాజా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మధ్య ఇంకా విభేదాలు సమసిపోలేదన్న సమాచారం అధిష్ఠాన వర్గానికి అందింది. దీంతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బొంతు రామ్మోహన్, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ చైర్మన్ గ్యాదరి బాలమల్లు ఇరువురిని కడియం, రాజయ్యకు మధ్య సయోధ్య కుదర్చే బాధ్యతను అప్పగించింది. వీరిద్దరు వరంగల్‌కు వెళ్లి కడియం, రాజయ్య వర్గాలను సమావేశపరిచి పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేస్తామని మాట తీసుకుని వచ్చారు. ప్రకటించిన 105 మంది అభ్యర్థులలో ఎవరినీ మార్చే ప్రసక్తే లేదని టీఆర్‌ఎస్ అధిష్ఠానం తేల్చిచెప్పడంతో టికెట్ ఆశించే నేతల ఆశలు వమ్మయ్యాయి. పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే తమకు నామినేటెడ్ పదవులు దక్కుతాయని రాజీపడగా, మరికొందరు మాత్రం తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి పార్టీ అభ్యర్థిని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. భూపాల్‌పల్లి టికెట్‌ను తాజా మాజీ సిట్టింగ్, స్పీకర్ సిరికొండ మధుసూదనాచారికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడి నుంచి టికెట్ ఆశించిన గండ్ర సత్యనారాయణరావును బుజ్జగించడానికి ఎన్ని రాయబారాలు పంపినా ఆయన లొంగలేదు. తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోనే నిలుస్తానని ప్రకటించారు. ఇలాంటి పరిస్థితి ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో నెలకొన్నప్పటికీ ఇక వారిని పట్టించుకోవద్దని అధిష్ఠానం నిర్ణయించింది. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి విజయానికి పరోక్షంగా తోడ్పడే ఉద్దేశంతోనే వీరు రాజీపడటం లేదని అధిష్ఠానం అంచనా వేస్తోంది. టికెట్ ఆశించిన కొందరు అసమ్మతి నేతలకు తిరిగి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్ పదవులను ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది. అయితే ఎంతమందికని నామినేటెడ్ పదవులు ఇవ్వగలరు? ఎన్నికలయ్యాక తమను పట్టించుకుంటుందా? గెలిచిన అభ్యర్థి నిజాయితిగా సహకరిస్తారా? నన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసమ్మతి నేతలు మనస్సు పూర్తిగా సహకరిస్తున్నారా? మొక్కుబడిగా పని చేస్తున్నారా? అనే విషయంపై అధిష్ఠానం నిఘా పెట్టినట్టు సమాచారం.