తెలంగాణ

బలం ఉంటే పొత్తులెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటే తెలుగుదేశం పార్టీతో పొత్తులు చేయడం ఎందుకని తాజా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు తన పట్ల అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తనకు కాంగ్రెస్ పార్టీ రాజకీయ భిక్ష పెట్టలేదని, అయితే తాజా మాజీ ఎమ్మెల్యే డీకే అరుణకు రాజకీయ భిక్ష పెట్టింది తానేనని ఆయన నొక్కి చెప్పారు. డీకే అరుణ నాలుగు జన్మలెత్తినా తనపై వేలెత్తి చూపలేరని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ కోసం డీకే అరుణ రాజీనామా చేయకుండా చివరిదకా కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో కొనసాగిందన్నారు. కొల్లాపూర్‌లో ఎన్నికల్లో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.