తెలంగాణ

టీఆర్‌ఎస్‌తో నాకు ప్రాణహాని: రేవంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లో ఎన్నికల కమిషనర్ రజత్‌కుమార్‌తో భేటీ అయ్యారు. సీఎం కేసీఆర్ తనకు రూ. 10 కోట్లు ఇస్తానన్నారని రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చేసిన రాజకీయ వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేశానని ఆయన చెప్పారు. నాయిని వ్యాఖ్యల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేయాలని, లేదంటే తన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయాలని కోరినట్లు చెప్పారు. నాయిని స్టేట్‌మెంట్ రికార్డు చేసి కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని ఈసీకి వివరించారు. తెరాస ప్రభుత్వంతో తనకు ప్రాణహాని ఉందని, అందుకు కేంద్ర సంస్థల సిబ్బందితో భద్రత కల్పించాలన్నారు. ఇటీవల తెరాస నేతలు మాట్లాడుతున్న తీరు చూస్తే తనను భౌతికంగా అంతమొందిస్తామని చెప్పడమే అందకు సాక్ష్యమని ఆయన చెప్పారు. ఇలా ఉండగా ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చేసిన రాజకీయ వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి.