తెలంగాణ

అలక పాన్పుపై కోదండరామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ అలక పాన్పు ఎక్కారు. అయితే ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వెంటనే ప్రొఫెసర్ కోదండరామ్‌ను కలిసి చర్చించారు. తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకోరాదని, అలా చేస్తే ఓట్లు చీలిపోయి, టీఆర్‌ఎస్‌కు లాభం చేకూరుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకు ప్రొఫెసర్ కోదండరామ్ స్పందిస్తూ రాష్ట్రంలో 17 లోక్‌సభ సీట్లు ఉన్నాయని, అందులో హైదరాబాద్ లోక్‌సభ తీసేస్తే మిగతా 16 లోక్‌సభ సీట్ల నుంచి కనీసం ఒక్కొక్క సీటు అయినా ఇస్తేనే తాము కూటమిలో కొనసాగుతామని, లేదంటే తమ దారి తమకు ఉందని అన్నట్లు సమాచారం. దీంతో రమణ, చాడ టీ.పీసీసీ ఉత్తమ్‌కుమార్ రెడ్డితో సమావేశమై పొత్తుల సంగతి త్వరగా తేల్చాలని కోరారు.
ఇలాఉండగా మహాకూటమి పేరును తెలంగాణ పరిరక్షణ వేదికగా మార్చాలని వారు భావించారు. పొత్తుల అంశాన్ని ఈ ఒకటి, రెండు రోజుల్లో తేల్చాలని వారు నిర్ణయించారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన స్క్రీనింగ్ కమిటీ ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు అభ్యర్థుల చొప్పున ఎంపిక చేసి జాబితా సిద్ధం చేసింది. ఆ జాబితాను స్క్రీనింగ్ కమిటీ అధిష్టానం ముందు పెట్టి పేర్లు ఖరారు చేయించుకోవాల్సి ఉంది. అయితే అంతకంటే ముందు మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు జరగాల్సి ఉంది.