తెలంగాణ

కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 16: ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం రోజు, రోజుకూ పెరుగుతున్నది. వివిధ పార్టీల నుంచి నాయకుల చేరికలు, వివిధ కారణాలతో కాంగ్రెస్‌ను వీడిన నేతలు వెనక్కి వస్తున్నందున వారి ఉత్సాహం రెట్టింపు అవుతున్నది.
దేశ వ్యాప్తంగా ఎన్నికలు లేనందున, తెలంగాణలో ప్రచారం చేసేందుకు ఎక్కువ సమయం కేటాయించవచ్చని పార్టీ అధిష్టానం భావిస్తున్నది. ఇందులో భాగంగానే ఈ నెల 20న ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు రానున్నారు. ఆ రోజున ఉదయం హైదరాబాద్‌కు చేరుకోగానే ఆయన చారిత్రాత్మక చార్మినార్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన రాజీవ్ సద్భావన యాత్రలో పాల్గొంటారు. అక్కడి నుంచి ఆయన హెలికాప్టర్‌లో ఆదిలాబాద్ జిల్లా బైంసాలో ప్రచారంలో పాల్గొంటారు. అనంతరం నేరుగా కామారెడ్డి చేరుకుని ఎన్నికల సభలో పాల్గొంటారు. ఆ తర్వాత అదే రోజు రాత్రి 8 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళతారు.
ఇలాఉండగా రాహుల్ గాంధీ మలి విడత పర్యటన ఖమ్మంలో నిర్వహించాలని పార్టీ భావిస్తున్నది. ఈ నెల 27న ఖమ్మం జిల్లాలో ప్రచారం నిర్వహించే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లా కేంద్రంలో బహిరంగ సభ నిర్వహిస్తే భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్, సూర్యాపేట జిల్లాల పార్టీ శ్రేణులకు, ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని టీ.పీసీసీ నేతలు ఆలోచన చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర ఎన్నికల ప్రచారం కమిటీ చైర్మన్ మల్లు భట్టివిక్రమార్క ఈ మేరకు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. రాహుల్ పర్యటన తర్వాత సోనియా గాంధీని ఆహ్వానించాలని ప్రచార కమిటీ ఆలోచన చేస్తున్నది. ఎన్నికల ప్రచారం ముగిసేంత వరకూ పేరున్న ఏఐసీసీ నాయకులను ప్రచారానికి ఆహ్వానించేలా కమిటీ ప్రణాళిక సిద్ధం చేస్తున్నది.