తెలంగాణ

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు కేటీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: స్విట్జర్లాండ్ దావోస్‌లో జనవరి 22 నుంచి 25 వరకు నిర్వహించనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సభలకు మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు నిర్వాహకుల నుంచి ఆహ్వానం అందింది. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను మాత్రమే ఫోర మ్ ఆహ్వానించడం ఆనవాయితీ. అయితే గత ఏడాది జరిగిన సమావేశాలకు కూడా మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం లభించగా ఆయన హాజరైన విషయం తెలిసిందే. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి మూడు వేల మంది పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వాల ప్రతినిధులు, ఇతర విశిష్ట అతిథులు ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. పారిశ్రామిక సంస్కరణలతో పాటు తెలంగాణ ప్రభుత్వం అనేక వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి కేటీఆర్‌కు పంపించిన ఆహ్వానంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ కొనియాడింది. తెలంగాణ ప్రభుత్వం అర్బన్ డవలప్‌మెంట్, డిజిటలైజేషన్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఉద్యోగాల కల్పన, పాలనలో పారదర్శకత వంటీ కీలకమైన అంశాలను వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వేదికపై మంత్రి కేటీఆర్ వివరించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయడానికి, మరిన్ని పెట్టుబడులను రాబట్టుకోవడానికి ఫోరమ్‌ను వేదికగా వినియోగించుకోవాలని ఆహ్వాన పత్రంలో ఫోరమ్ అధ్యక్షుడు బ్రిర్జ్ బ్రినె్డ పేర్కొన్నారు. మరోసారి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నుంచి ఆహ్వానం లభించడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేసారు. ఇది తెలంగాణ ప్రజలకు లభించిన గౌరవంగా భావించారు.