తెలంగాణ

నేడు కేంద్ర ఎన్నికల బృందం రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 21: తెలంగాణ శాసనసభకు జరిగే ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ నేతృత్వంలో 11 మంది సభ్యుల బృందం సోమవారం హైదరాబాద్ వస్తోంది. ఈ బృందం మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోనే మకాం వేసి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలిస్తుంది. కేంద్ర బృందం తన కార్యక్రమాలన్నీ హైదరాబాద్‌నగరానికే పరిమితం చేస్తోంది. క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదు. క్షేత్రస్థాయి సమస్యలను జిల్లా స్థాయి అధికారులతో చర్చల ద్వారానే తెలుసుకుంటారు. కేవలం మూడు రోజులే హైదరాబాద్‌లో ఉండటం వల్ల క్షేత్రస్థాయి పర్యటనకు అవకాశం లేదని సీఈఓ రజత్ కుమార్ వెల్లడించారు.
సోమవారం మధ్యాహ్నం 1.15 గంటలకు ఢిల్లీ నుండి విమానంలో బయలుదేరే కేంద్ర బృందం 3.15 గంటలకు హైదరాబాద్‌కు వస్తుంది. ఈ బృందం నేరుగా తాజ్ కృష్ణా హోటల్‌కు చేరుతుంది. బృందం సభ్యులంతా హోటల్‌లోనే బసచేస్తారు. సమావేశాలు కూడా హోటల్‌లోనే ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ చేరిన తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకునే బృందం సాయంత్రం 5.30 గంటల నుండి 7.30 గంటల వరకు రాజకీయ పార్టీలతో సమావేశమవుతుంది. రాజకీయ పార్టీలతో వేర్వేరుగా సమావేశం అవుతారని అధికారవర్గాలు వెల్లడించాయి. ఒకే పర్యాయం వివిధ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావలడం వల్ల ఉద్రిక్త పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని, అందువల్ల ప్రధాన రాజకీయపార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, ఎంఐఎం, బీఎస్‌పీ తదితర పార్టీల నేతలతో మాట్లాడి, వారి వారి అభిప్రాయాలను తీసుకుంటారని అధికార వర్గాలు వివరించాయి. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం పూర్తయిన తర్వాత అధికారులతో సమావేశాలు ఉంటాయి. రాత్రి 7.30 గంటల నుండి 8.30 గంటల వరకు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి (సీఈఓ) డాక్టర్ రజత్ కుమార్, స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్లతో సమావేశమవుతారు. మంగళవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పోలీస్ ఐజీ, పోలీస్ డీఐజీలు, జిల్లా కలెక్టర్లయిన జిల్లా ఎన్నికల అధికారులు, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్లతో సమావేశమవుతారు. హైదరాబాద్‌లోని రాష్టస్థ్రాయి అధికారులతో పాటు, జిల్లాల నుండి దాదాపు 80 మంది అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిసింది. మధ్యాహ్నం 1.30 నుండి 2.30 గంటల వరకు భోజనానికి విరామం ఇస్తారు. తిరిగి మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 6 గంటల వరకు జిల్లా స్థాయి అధికారులతోనే సమావేశమవుతారు. ఒకే సారి వివిధ జిల్లాల అధికారులతో సమావేశం కావడం వల్ల ఒక ప్రాంతానికి చెందిన అధికారులు లేవనెత్తే సమస్యలు ఇతర ప్రాంతాల్లో కూడా ఉండే అవకాశం ఉంటుందని, వాటికి వెంటనే సమాధానం ఇచ్చేందుకు వీలవుతుందని సీఈఓ కార్యాలయం తెలిపింది.
కేంద్ర బృందం పర్యటనలో చివరిరోజైన బుధవారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు, డైరెక్టర్ జనరల్ (ఐటీ) లతో సమావేశమవుతారు. ఎన్నికల సందర్భంగా జరిగే అవకతవకలు, అక్రమాలకు చెక్ పెట్టేందుకు రాష్టస్థ్రాయి అధికారులకు అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తారు. ఉదయం 11.15 గంటల నుండి 12 గంటల వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కే జోషితో సమావేశమవుతారు. జోషితో పాటు జనరల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిసింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది, రవాణా సౌకర్యాలు, నిధులు తదితర అంశాలపై చర్చిస్తారని తెలిసింది. ఆ తర్వాత 12.30 గంటల నుండి 1 గంట వరకు మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేస్తున్నారు.

చిత్రం..సీఈఓ రజత్ కుమార్