తెలంగాణ

బోగస్ ఓట్లు తొలగించనే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 22: ముందస్తు ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో బోగస్ ఓట్లు తొలగించలేదని, కొత్త ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని, ఇందుకు వీలుగా కమిషన్ వెబ్ సైట్ పనిచేయడం లేదని బీజేపీ బృందం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. బీజేపీ బృందం నేతలు ఎన్ ఇంద్రసేనారెడ్డి, కామరుసు బాల సుబ్రహ్మణ్యం, కే ఆంథోని రెడ్డి, గోకుల్ రామారావులు ఎన్నికల కమిషన్‌కు , కమిషన్ సభ్యులకు 8 పేజీల వినతిపత్రాన్ని పంపించారు. ఇష్టారాజ్యంగా నగదు పంపిణీ జరుగుతోందని, కొత్త ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి కమిషన్ వెబ్ సైట్ పనిచేయడం లేదని, పత్రికల్లో వస్తున్న పెయిడ్ ఆర్డికల్స్ సంగతేమిటని వారు ప్రశ్నించారు. వివక్ష చూపుతున్న అధికారులను ఎన్నికల విధుల నుండి తప్పించాలని వారు కోరారు. తెలంగాణలో ఆంధ్రా నిఘా అధికారులు పనిచేస్తున్నారని వారిని వెనక్కు పంపించాలని సూచించారు. ఈ సందర్భంగా బీజేపీ బృందం పలు ఆరోపణలు చేసింది. రాష్ట్రంలో అంబులెన్స్‌లు, మీడియా ఓబీ వ్యాన్లు, ఆర్టీసీ బస్సులు, ఏటీఎంలకు డబ్బు చేరవేసే వాహనాల్లో నగదు రవాణా అవుతోందని దీనిని అరికట్టాలని వారు పేర్కొన్నారు. బోగస్ ఓటర్లను తొలగించాలని చేసిన సూచనలను పట్టించుకోలేదని, ముషీరాబాద్, హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం, మలక్‌పేట, చార్మినార్ అసెంబ్లీ, యాకుత్‌పుర, చాంద్రాయణ గుట్ట, బహుదూర్‌పురల్లో ఉన్న బోగస్ ఓటర్ల జాబితాలను ఎన్నికల కమిషన్‌కు బీజేపీ సమర్పించింది. జాబితాలను బహిరంగంగా ఎవరికీ కనిపించకుండా వెబ్ పోర్టల్‌లో ఉంచారని, ఇది కొన్ని రాజకీయ పార్టీలకు కొమ్ముకాయడమేనని అన్నారు. ఓటర్ల జాబితాలో ఉన్న లోపాలు అన్నింటిపైనా తక్షణం సమగ్ర విచారణ జరగాలని వారు డిమాండ్ చేశారు. సీసీటీవీలు , వెబ్ కేమరాలను పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని, రొహింగ్యాల జాబితాలను ప్రచురించాలని బీజేపీ కోరింది. ఎన్నికల సీఈఓ పోర్టల్ పనిచేయడం లేదని, అప్‌డేట్ కాలేదని వారు పేర్కొన్నారు. అదే విధంగా సువిధ పోర్టల్ కూడా పనిచేయడం లేదని అన్నారు. ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియాకు సమగ్ర మార్గదర్శకాలు లేకపోవడం వల్ల పెయిడ్ ఆర్టికల్స్ వస్తున్నాయని, అదే విధంగా ఒపీనియన్ పోల్స్‌పై మార్గదర్శకాలు జారీ కావాలని అన్నారు. కొంత మంది అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని వారిని ఎన్నికల విధుల నుండి తప్పించాలని సూచించారు.