తెలంగాణ

కేసీఆర్‌ను బోనులో నిలబెడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 22: ఎన్నికల అనంతరం బీజేపీ అధికారంలోకి రాగానే కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపిస్తామని, కేసీఆర్ జైలుకు పోవడం ఖాయమని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి పేర్కొన్నారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ ఒక్క హామీనీ టీఆర్‌ఎస్ నెరవేర్చలేదని , మళ్లీ ఓట్ల కోసం ప్రచారానికి వెళ్తుంటే తమ అభ్యర్ధులపై ప్రజలు తిరగబడుతుంటే భయపడి కొత్త కొత్త హామీలను టీఆర్‌ఎస్ ఇస్తోందని ఇంద్రసేనారెడ్డి అన్నారు. సోమవారం నాడు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్ధులు గత ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను గమనించి విపక్ష నేతలపై అసభ్య పదజాలంతో ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, అబద్దాలు చెబుతున్నారని ప్రజాసమస్యలను పక్కదారిపట్టించాలని చూస్తున్నారని అన్నారు.
ఇదంతా గమనిస్తే తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌ను గద్దెదింపడానికి నిర్ణయించుకున్నారని అన్నారు. కేసీఆర్ వంద సీట్లు గెలుస్తామని, 70 శాతం ఓట్లు వస్తాయని ప్రజలను, వారి కార్యకర్తలను మోసం చేస్తున్నారని అన్నారు. గత నాలుగేళ్ల పాలనలో ఏకకాలంలో రుణమాఫీ చేయలేని కేసీఆర్ ఇపుడు ఎలా చేస్తారని నిలదీశారు. ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయని కేసీఆర్ ఇపుడు నిరుద్యోగ భృతి ఇస్తామని తెలంగాణ యువతను మోసం చేస్తున్నారని అన్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఇవ్వకుండా ఖమ్మంలో గిరిజన రైతులకు బేడీలు వేసి, నాఫెడ్ ద్వారా కేంద్రం నిధులు ఇచ్చినా కందులు కొనకుండా , కేంద్రం ఫసల్ బీమా యోజన కింద నిథులు ఇచ్చినా రైతులకు బీమా వర్తింపచేయకుండా మోసం చేశారని, ఇపుడు రైతులకు ఏదో వెలగబెడతానంటే నమ్మడానికి తెలంగాణ రైతులు సిద్ధంగా లేరని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ముస్లిం ఓట్లు పొందడం కోసం కాంగ్రెస్ పార్టీ మత రాజకీయం చేస్తోందని ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. భూ కబ్జా, నేషనల్ హెరాల్డ్ కేసులో కోట్లాది రూపాయిలను కాజేసి కుంభకోణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన కాంగ్రెస్ పార్టీ , దాని అధ్యక్షుడు రాహుల్ గాంధీ, గత నాలుగున్నరేళ్లు పాలనలో ఒక్క అవినీతి మరక లేకుండా పాలన అందిస్తున్న నరేంద్రమోదీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ, నీతులు వల్లించడం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లిస్తున్నంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి కామర్సు బాలసుబ్రహ్మణ్యం, అధికార ప్రతినిధులు కృష్ణసాగరరావు, డాక్టర్ ఎస్ ప్రకాష్‌రెడ్డి, అల్జాపూర్ శ్రీనివాస్, కొల్లి మాధవి తదితరులు పాల్గొన్నారు. కాగా ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్‌తో మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. బీజేపీ మేనిఫెస్టోలో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని చేర్చాలని ఆయన కోరారు.
చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి