తెలంగాణ

ఎఎండి పరిశోధనల్లో విద్యాసంస్థలకు చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 3: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న విఎల్‌ఎస్‌ఐ అకాడమీలో భాగస్వామి అయ్యేందుకు అమెరికాకు చెందిన ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎఎండి సంసిద్థత వ్యక్తం చేసింది. ఐటి శాఖ మంత్రి కె తారకరామారావు సిలికాన్ వ్యాలీ పర్యటనలో భాగంగా ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎఎండిలో కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రూత్ కాటర్‌తో సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమం సాగుతున్న కాలంలోనూ, తదనంతర పరిణామాలతోనూ హైదరాబాద్‌లో తమ కంపెనీ కార్యకలాపాలు, భవిష్యత్తుపట్ల ఎన్నో అనుమానాలు ఉండేవని, వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ నూతన ప్రభుత్వం తీసుకున్న చర్యలు అద్భుతమని ఎఎండి ప్రతినిధులు ప్రశంసించారు. హైదరాబాద్ నగరం పట్ల తమ నమ్మకాన్ని కాపాడినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సంస్థ నూతన ఉత్పత్తులను, మార్కెట్ వ్యూహాలను ముఖ్యంగా తెలంగాణలో కంపెనీ పనితీరును వారు కెటిఆర్‌కు వివరించారు. తాము కొత్తగా రూపొందించిన జెన్ చిప్‌ను పూర్తిగా హైదరాబాద్‌లోనే డిజైన్ చేసినట్టు చెప్పారు. రాబోయే రోజుల్లో హైదరాబాద్ నుంచి అనేక నూతన ఉత్పత్తులను డిజైన్ చేయనున్నట్టు తెలిపారు. నగరంలో కంపెనీ తరపున చేస్తున్న సేవా కార్యక్రమాలను కూడా కంపెనీ వైస్ ప్రెసిడెంట్ రూత్ కాటర్స్ మంత్రికి వివరించారు. తమ కంపెనీ చిప్ టెక్నాలజీతో బాహుబలి లాంటి హిట్ సినిమాకు గ్రాఫిక్స్ అందించినట్టు తెలిపిన ఎఎండి, తెలుగు సినిమాలతోపాటు ఇతర భాషాచిత్రాలకూ సాంకేతిక సహకారం అందించనున్నట్టు తెలిపారు.
కంపెనీ భవిష్యత్తు వ్యూహాల్లో గ్రాఫిక్స్, వర్చువల్ రియాలిటీ, గేమింగ్, మాన్యుఫాక్చరింగ్ వంటి వాటిని ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకున్నట్టు చెప్పారు. గేమింగ్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇమేజ్ సిటీ గురించి కెటిఆర్ ఎఎండికి వివరించి, అందులో భాగస్వాములు కావాలని కోరారు. ఎఎండి పరిశోధనలకు ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో తెలంగాణలోని ట్రిబుల్ ఐటి, ఐఐటి, బిట్స్‌పిలానీ వంటి విద్యా సంస్థలను భాగస్వామ్యం చేయాలని కోరారు. బాసర ట్రిబుల్ ఐటి, వరంగల్ ఎన్‌ఐటిలను సైతం పరిగణనలోకి తీసుకోవాలని కెటిఆర్ చేసిన సూచనకు ఎఎండి సానుకూలంగా స్పందించింది.

ఎఎండి కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రూత్ కాటర్, సంస్థ సిబ్బందితో సమావేశమైన మంత్రి కెటిఆర్