తెలంగాణ

అప్రమత్తంగా ఉండండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: తెలంగాణ శాసనసభకు డిసెంబర్ 7 న జరిగే పోలింగ్, ఆ తర్వాత జరిగే కౌంటింగ్ పూర్తయ్యే వరకు అత్యంత జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఓ.పీ. రావత్ హెచ్చరించారు. తెలంగాణతో పాటు ఎన్నికలు జరుగుతున్న చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల ఉన్నతాధికారులతో ఆయన సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో వివిధ అంశాలపై రావత్ చర్చించారు. ఇప్పటి వరకు తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి చేపట్టిన పనులు, కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితాపై ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులపై తెలంగాణ సీఈఓ, సంబంధిత అధికారులు తీసుకున్న చర్యలు బాగున్నాయన్నారు. జాబితాలో పేర్లు లేని ఓటర్ల నుండి వెంటనే ఫామ్-6ఏ తీసుకుని వారి పేర్లను జాబితాలో చేర్చాలని సూచించారు. ఇందుకోసం కిందిస్థాయి సిబ్బంది సమర్థతగా, సక్రమంగా పనిచేసేలా చూడాలని సూచించారు. తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ఈ నెల 10 న నోటిఫికేషన్ జారీ అవుతోందని, నామినేషన్ల ఘట్టం ప్రారంభమైనప్పటి నుండి కౌంటింగ్ పూర్తయ్యే వరకు నిర్ణీత తేదీల్లో ఆ యా పనులను చేయాల్సిన అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా మెలిగేలా చూడాలని ఆదేశించారు.
ఈనెల 12, 20 తేదీల్లో చత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న శాసనసభ ఎన్నికలకోసం తెలంగాణ రాష్ట్రం నుండి పూర్తి సహాయ, సహకారాలను అందిస్తామని తెలంగాణ రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.కే. జోషి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. తెలంగాణ సరిహద్దు జిల్లాల అధికారులు, చత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దు జిల్లాల అధికారులతో నిరంతరం సంప్రదిస్తుంటారని తెలిపారు. ఈ సమావేశంలో కేంద్ర ఎన్నికల కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.