తెలంగాణ

అక్కడో మాట.. ఇక్కడో మాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: టీఆర్‌ఎస్ పెద్దలు చెప్పే అబద్దాలకు విసిగు చెందిన తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఇంటికి పంపించే పనిలో ఉన్నారని టీటీడీపీ ప్రధాన కార్యదర్శి బండ్రు శోభారాణి పేర్కొన్నారు. గత వారం రోజులుగా కేటీఆర్ మాట్లాడుతున్న తీరును చూస్తే తెలంగాణ ప్రజలను మరో సారి మోసం చేయాలని చూస్తున్నారని స్పష్టంగా తెలుస్తోందని పేర్కొన్నారు. ఏరోటికాడ ఆ పాట అన్నట్టు కేటీఆర్ మాటలు ఉన్నాయని అన్నారు. హైదరాబాద్‌లో ఒకలా, మహబూబాబాద్‌లో మరోలా మాట్లాడుతున్నారని, యాదాద్రి భువనగరి జిల్లాకు వెళ్తే ఇంకో రకంగా మాట్లాడుతున్నారని ఆమె ఆరోపించారు. ఐదేళ్ల పాలనకు అధికారం ఇస్తే 9 నెలల ముందే వీఆర్‌ఎస్ తీసుకుని మరోమారు అధికారం ఇవ్వాలని టీఆర్‌ఎస్ నేతలు బ్రతిమాలుకుంటున్నారని అన్నారు. గ్రామాల్లో టీఆర్‌ఎస్ నేతలను ప్రజలు తరిమి కొడుతున్నారని అయినా నోటికి ఇష్టమొచ్చిన భాషను వాడుతున్నారని ఎద్దేవా చేశారు. అమెరికాలో చదివానని చెప్పుకుంటూ గుంట నక్క, ముసలి నక్క వంటి పదాలు వాడటంలో ఇంగితజ్ఞానం కనిపిస్తోందని అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ గడి అయితే తెలగుదేశం పార్టీ గుడి, బడి లాంటిదని, గడి కావాలో గుడి బడీ కావాలో తేల్చుకోవల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. అమరుల త్యాగాల మీద కేసీఆర్ కుటుంబం భోగాలను అనుభవిస్తోందని, బడుగు, బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని అన్నారు.