తెలంగాణ

యువత స్వయం శక్తిగా ఎదగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, నవంబర్ 10: యువత స్వయంశక్తిగా ఎదగాలని అలా ఎదిగినప్పుడే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని మాజీ ఐపిఎస్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా ధర్మపూర్ గ్రామంలో గల జయప్రకాష్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు స్నాతకోత్సవ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పట్ట్భద్రులు కావడం అంటే కుటుంబానికి సమాజానికి, ప్రజలకు భద్రత కల్పించడమేనని ఆయన అన్నారు. విద్యార్థులు సాధించిన పట్టా బయట ఉద్యోగానికి వెళ్తే ఒక్క నిమిషం చూడడానికే తప్పా దేనికి పనికిరాదని ఆయన తెలిపారు. విద్యార్థి దశలో నేర్చుకున్న చదువు ప్రపంచానికి ఏ విధంగా ఉపయోగపడుతుందోనని అడుగుతారు తప్పా. పట్టాను చూసి ఎవరు ఉద్యోగాలు ఇవ్వరని ఆయన అన్నారు. ముఖ్యంగావిద్యార్థులు వ్యక్త్ధిర్మం, వృత్త్ధిర్మం, సామూహిక ధర్మం, సామాజిక ధర్మం ఈ నాలుగు ధర్మలను పాటించినప్పుడే దేశానికి మేలు జరుగుతుందని అబ్దుల్ అలాం అన్నారని ఆయన పెర్కోన్నారు. పట్ట్భద్రులైన విద్యార్థులు ప్రతి ఒక్కరు ఓ లక్ష్యం ద్వారా కొత్త్ధనం కనిపెట్టి కొత్తగా నా దేశం కోసం, ప్రజల కోసం ఎదైన చేయాలనే తపనతో ముందుకుసాగాలని ఆయన తెలిపారు. అలాంటప్పుడే ఉద్యోగాలు ఆశీంచకుండా ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి భారతదేశం అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. అందుకే యువత గొప్పగా ఆలోచించి ఉన్నతస్థాయికి ఎదగాలంటే వారి శరీరం వారు చెప్పినట్లు వినాలని టెక్నాలజికి యువతలోనై మాట్లాడడానికి జంకుతున్నారని అలా కాకుండా మహనీయుల పేరిట పుస్తకాలు ఉన్నాయని అలాంటివారిపుస్తకాలను చదివినప్పుడే యువతలో స్పూర్తి వస్తుందని అప్పుడే సమాజంలో గట్టిగా నిలబడి మాట్లాడగలిగేశక్తి ఆలోచన విధానం కూడా వస్తుందన్నారు.

చిత్రం..జేపీఎన్‌సీఇ కళాశాలలో నిర్వహించిన స్నాతకోత్సవ వేడుకల్లో మాట్లాడుతున్న జేడీ లక్ష్మీనారాయణ