తెలంగాణ

కరెంటు అడిగితే కాల్చి చంపిన బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, నవంబర్ 10: కరెంటు అడిగిన పాపానికి పిట్టల్లా కాల్చి చంపిన చంద్రబాబు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణలో ఓట్లు అడుగుతారని రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్‌రావు ఎద్దేవా చేశారు. శనివారం గజ్వేల్ లోని రిటైర్డ్ ఉద్యోగులు, మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆద్వర్యంలో నిర్వహించిన ఆశీర్వాదసభకు హాజరై ఆయన ప్రసంగించారు. ఓటుకు నోటు దెబ్బతో అమరావతిలో పడిన చంద్రబాబు కేంద్రంతో కుమ్ముక్కై ఇక్కడి ప్రాజెక్టుల అనుమతులు అడ్డుకున్న సంగతి రాష్ట్ర ప్రజలకు తెలసిందేనని స్పష్టం చేశారు. ముఖ్యంగా తెలంగాణ అభివృద్దిని కుంటు పర్చేందుకు మహాకూటమి ఏర్పాటు కాగా, రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టే విదంగా కాంగ్రెస్ నేతలు వ్యవహరించడం ఎంత మాత్రం తగదని నిలదీశారు. అలాగే ఏపీ అసెంబ్లీ భవనాలను అప్పగించాలని గవర్నర్ వద్ద పంచాయతీ పెట్టినప్పటికీ ససేమిరా అంటున్న చంద్రబాబు భవిష్యత్తు లో కష్టాలు కొనితెచ్చుకోక తప్పదని తెలిపారు. అంతేగాకుండా ఇక్కడి ప్రజలకు చెందిన నిజాం కాలంనాటి ఆస్తులను పంచాలని చంద్రబాబు డిమాండ్ చేస్తుండగా, మరి ప్రభుత్వరంగ సంస్థల పంపకాల సంగతేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మగౌరవంతో బ్రతుకుతున్న తెలంగాణ ప్రజలకు ఇబ్బందులు గురిచేసే క్రమంలోనే చంద్రబాబు చర్యలు ఉంటుండ గా, నీల్లు, నిదులలో వాటా కోసమే కాంగ్రెస్‌ను పావుగా వినియోగిం చుకోనున్నట్లు ఎద్దేవా చేశారు. నిజాం పాలనలో భూమిశిస్తు వసూలు చేయగా, రైతులకే సీఎం కేసీఆర్ శిస్తు కట్టడంతోపాటు పాత బకాయలు రద్దు చేసి రైతుబంధు పథకంతో అన్నదాతల్లో వెలుగులు నింపిన ఘనత దక్కించుకున్నట్లు తెలిపారు. గజ్వేల్‌కు త్వరలోనే రైలుకూత, రిజినల్ రింగ్‌రోడ్డు రానుండగా, నూతన పారిశ్రామికరణతో స్వర్ణయుగం కాబోతున్నట్లు చెప్పారు. అభివృద్దిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఓటమి ఎరుగని కేసీఆర్ సిద్దిపేట, కరీంనగర్, మహబూబ్‌నగర్, గజ్వేల్‌ల నుండి ప్రాతినిత్యం వహించినట్లు పేర్కొన్నారు. మెజార్టీని లక్ష దాటిస్తేనే కేసీఆర్ మరింత ఉత్సాహంతో అభివృద్ది పనులు చేపట్టనుండగా, విజ్, నాన్‌విజ్ మార్కెట్, ఎడ్యుకేషన్‌హబ్ దేశంలోనే ఆదర్శంగా నిలిచినట్లు అన్నారు.

చిత్రం..మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆశీర్వాద సభలో మాట్లాడుతున్న మంత్రి హరీష్‌రావు