తెలంగాణ

సిధారెడ్డి సాహిత్యం విశ్వవ్యాప్తం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, నవంబర్ 11 : తెలంగాణ సాహిత్య,సాంస్కృతిక రంగంలో అగ్రశ్రేణి చెందిన సాహితివేత్తల్లో ఒకరైన నందిని సిధారెడ్డి సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి అధ్యక్షుడు గంట జలంధర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేటలో ఆదివారం ఏర్పాటు చేసిన సాహితివేత్తల ఆత్మీయుల సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ సాహిత్యరంగం గర్వించదగ్గ సిధారెడ్డి సాహిత్యాన్ని ఇంగ్లీష్, హిందీ భాషల్లో అనువదించి విధంగా తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి పూనుకుందన్నారు. సిధారెడ్డి సాహిత్యంపై భాషా, సాంస్కృతిక మండలం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఇటీవల రెండు రోజుల పాటు జాతీయ సాహిత్య సదస్సు జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన సాహిత్య ప్రస్థానంపై మందారం, శిఖరం అనే రెండు పుస్తకాలను ప్రచురించిందన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న సాహితీ మిత్రులకు రెండు పుస్తకాలను అందచేశారు. గంట జలాందర్‌రెడ్డి, ఏనుగు నర్సింహరెడ్డిలను సిద్దిపేట సాహిత్య మిత్రులు శాలువాలతోఘనంగా సన్మానించారు. తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ నందిని సిధారెడ్డి, కార్యదర్శి ఏనుగు నర్సింహరెడ్డి, ప్రెస్ అకాడమీ సభ్యులు అంజయ్య, భగవాన్‌రెడ్డి, తైదల అంజయ్య పాల్గొన్నారు.

చిత్రం.. భాష, సాంస్కృతిక మండలి అధ్యక్షుడు గంట జలందర్‌రెడ్డిని సన్మానిస్తున్న కవులు