తెలంగాణ

గాంధీ భవన్ వద్ద అదే లొల్లి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: ముందస్తు ఎన్నికలకు ఇంకా కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించలేదు. అయినా తమకు సీటు రాదేమోనన్న అనుమానంతో 5 రోజులుగా కాంగ్రెస్ కార్యాలయమైన గాంధీ భవన్ ఆవరణలో, ప్రధాన గేటు వద్ద ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం వర్దన్నపేట ఆశావాహుడు కే.శ్రీ్ధర్ తన అనచరులతో గాంధీ భవన్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. ప్యారాషూట్‌తో ఆవరణలోకి దిగే వారికి టిక్కెట్లు ఇస్తున్నారని వారు విమర్శించారు. అయితే కార్యాలయంలోకి దూసుకెళ్ళకుండా పోలీసులు, ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే ఎం. కోదండ రెడ్డి వారి వద్దకు వచ్చి వినతి పత్రం తీసుకున్నారు. తొలుత శేరిలింగంపల్లి నుంచి ప్రారంభమైన నిరసన దీక్ష, ఆందోళనలు మల్కాజిగిరి, ఖానాపూర్, వర్దన్నపేట వరకూ పాకింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ముందు జాగ్రత్తగా ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. ఇంకా సోమవారం కొంత మంది బౌన్సర్లను దించారు. గాంధీ భవన్‌కు భద్రత పెంచాల్సిందిగా పోలీసు అధికారులనూ కోరారు.

చిత్రాలు.. గాంధీభవన్ వద్ద బౌన్సర్ల భద్రత
*గాంధీభవన్ వద్ద వర్ధన్నపేట కాంగ్రెస్ నాయకుల ఆందోళన..