తెలంగాణ

రియల్టీ దిశ తిరిగింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 5: రియల్ ఏస్టేట్ బూమ్ మళ్లీ పుంజుకుంది. ఔటర్ రింగ్ రోడ్‌కు వెలుపల మరో బాహ్య వలయం, హైదరాబాద్- వరంగల్ ఐటీ కారిడార్, యాదాద్రి డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు, ఆదిభట్లలో ఐటీ విస్తరణ, రావిర్యాల ఫాబ్ సిటీలో హార్డ్‌వేర్ పరిశ్రమలు, నూతన పారిశ్రామిక విధానంతో హైదరాబాద్ చుట్టుపక్కల కొత్తగా వెలుస్తున్న కొత్త పరిశ్రమలు, ముచ్చర్లలో ఫార్మాసిటీ స్థాపనకు భూసేకరణ ప్రక్రియ ప్రారంభం, రాచకొండగుట్టలో ఫిల్మ్ సిటీ ప్రతిపాదన తదితర అంశాలు రియల్టీ మళ్లీ రెక్కలల్లార్చడానికి కారణమని రియల్ ఏస్టేట్ నిపుణులు విశే్లషిస్తున్నారు. రియల్టర్లు చెబుతున్నట్టుగా కాకుండా మార్చితో ముగిసిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లపై వచ్చే వార్షిక ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుదలకు సంకేతాలనిస్తుంది. హైదరాబాద్ నగరం చుట్టూ విస్తరించివున్న రంగారెడ్డి జిల్లాలో నిర్మాణరంగం మొదటి నుంచీ రియల్ బూమ్‌లో ముందంజలో ఉన్న విషయం తెలిసిందే. రికార్డు స్థాయిలో రెండు నెలల కిందట తెలంగాణ పారిశ్రామిక వౌలిక వసతుల కల్పన సంస్థ వేలంపాటలు నిర్వహించగా ఎకరాకు రూ.27 కోట్ల ధర పలికిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఆవిర్భవిస్తే రియల్టీ రంగం కుదేలవుతుందని జరిగిన ప్రచారాన్ని ఈ వేలం పాటలు పటాపంచలు చేశాయి. రియల్ ఏస్టేట్ రంగం మళ్లీ పుంజుకోవడంతో నిరుడు రంగారెడ్డి జిల్లాల్లో భూ క్రయ విక్రయాల పెరుగుదల 37శాతంగా నమోదైంది. రంగారెడ్డి జిల్లా తర్వాత అత్యధికంగా రియల్ బూమ్‌లో నల్లగొండ జిల్లా మొదటిసారి రెండో స్థానాన్ని ఆక్రమించింది. హైదరాబాద్‌కు సమీపంలోని యాదగిరిగుట్టను తిరుమల తిరుపతి తరహాలో అభివృద్ధి పర్చడానికి ప్రభుత్వం యాదాద్రి డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేసింది. దీనికితోడు ఉప్పల్ నుంచి యాదగిరిగుట్ట వరకు మెట్రోరైలును పొడగించడానికి రైల్వేశాఖ ఆమోదించింది. దీంతో నల్లగొండ జిల్లా పరిధిలోకి వచ్చే యాదాద్రి (హైదరాబాద్- వరంగల్) మార్గంలో రియల్ ఎస్టేట్‌కు ఉహించని విధంగా డిమాండ్ వచ్చిపడింది. దీంతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ లెక్కల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో రంగారెడ్డి జిల్లా (37 శాతం) తర్వాత నల్లగొండ జిల్లా అత్యధికంగా 29 శాతం ఆదాయంతో రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఐటీ రంగాన్ని హైదరాబాద్ తర్వాత వరంగల్‌లోనే అభివృద్ధిపర్చడానికి సర్కార ప్రణాళికలు సిద్ధం చేయడం, అక్కడా కొన్ని కంపెనీలు పెట్టుబడి పెట్టడానికి ముందుకురావడం, అలాగే అక్కడ వెయ్యి ఎకరాల విస్ణీర్ణంలో టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుకు భూసేకరణ ప్రక్రియ మొదలుకావడం వల్ల కూడా రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల తర్వాత వరంగల్ జిల్లాల్లో రియల్ బూమ్ పెరిగినట్టు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు వెల్లిడించారు. రాష్ట్ర ఆదాయ వనరులు సమకూర్చడంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నాల్గవ స్థానంలో ఉంది. రాష్ట్ర ఆదాయంలో వాణిజ్య పన్నుల శాఖ రూ.29 వేల కోట్లతో మొదటిస్థానంలో, రూ.12 వేల కోట్లతో ఎక్సైజు శాఖ రెండో స్థానంలో, రూ.3750 కోట్లతో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ మూడోస్థానంలో, తర్వాత నాలుగు, ఐదు స్థానాల్లో రవాణా, గనుల శాఖలు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 2015-16 స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి రూ.2960 కోట్ల ఆదాయం వస్తుందని ఆర్థికశాఖ అంచనా వేసింది. అయితే అంచనాలకు మించి ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి (మార్చి చివర) రూ.3750 కోట్ల ఆదాయం వచ్చింది. రాష్ట్రంలో పెరిగిన రియల్ బూమ్‌కు పెరిగిన ఆదాయమే నిదర్శమని రెవిన్యూ శాఖ అధికారులు విశే్లషిస్తున్నారు.