తెలంగాణ

హైదరాబాద్ నుంచే బీజేపీ ప్రభంజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభంజనం హైదరాబాద్ నుండే మొదలవుతుందని, ఇది పెద్ద మలుపుఅని ఆ పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి రాం మాధవ్ ప్రకటించారు. మంగళవారం సాయంత్రం ఓ స్టార్ హోటల్‌లో నిర్వహించిన ‘హైదరాబాద్ ఫర్ న్యూ ఇండియా విజన్’ డాక్యుమెంట్ ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా అత్యుత్తమ సంక్షేమ కార్యక్రమాలను భారత ప్రధాని నరేంద్రమోదీ చేపట్టారని, పొరుగు దేశాలకు హెచ్చరికలు జారీచేస్తూనే విదేశాంగ విధానంలో పైచేయిగా నిలిచారని అన్నారు. దేశంలో ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టారని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలన్న పొరుగు దేశాల కుట్రలను తిప్పికొట్టారని అన్నారు. ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకుందని బీజేపీ జాతీయప్రధాన కార్యదర్శి పీ మురళీ ధరరావుతెలిపారు. బీజేపీ జాతీయ నాయకులు రాష్ట్రంలో బీజేపీ విజయానికి విస్తృతంగా పర్యటించి ప్రచారం చేశారని అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, నితిన్‌గడ్కారీ, రాజ్‌నాథ్‌సింగ్, నలుగురు సీఎంలు, సుష్మా స్వరాజ్, మరో 24 మంది కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రచారంలో పాల్గొన్నారని అన్నారు. చివరి రోజు కూడా యోగి ఆదిత్యనాధ్ కొన్ని సభల్లో పాల్గొంటారని ఆయన వెల్లడించారు. బీజేపీ తెలంగాణలో ప్రత్యామ్నాయం కోసం ప్రజలు స్పందిస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ఎవరి ఒత్తిడి లేకుండా నచ్చిన వ్యక్తిని ఎన్నుకునే అవకాశం ఉండాలని ఆయన స్పష్టం చేశారు. భాష, పదజాలం , దిగజారుడు వ్యాఖ్యల వల్ల ప్రజల్లో ప్రజాస్వామ్యం, రాజకీయ పార్టీల పట్ల అవిశ్వాసం పెరుగుతుందని అన్నారు. ఎన్నికల కమిషన్ చొరవ చూపించి ఎన్నికల ప్రక్రియ కలుషితం కాకుండా కాపాడాలని అన్నారు. మతం పేరుమీద సబ్ ప్లాన్ తెస్తామని చెప్పడం సరికాదని, అది రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలోనే ప్రజలను మోసం చేసిందని జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌నర్సింహరావుఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మత రాజకీయం చేస్తోందనేది ఆ పార్టీ ఈసీకి ఇచ్చిన ఫిర్యాదు ద్వారానే అర్ధం అవుతోందని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో ముస్లింలకు ప్రభుత్వ కాంట్రాక్టు ఇప్పిస్తామన్నందుకు సిగ్గుపడి క్షమాపణలు చెప్పాలని, మేనిఫెస్టో నుండి దానిని తొలగించాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.