తెలంగాణ

సంబరాల్లో కమలనాథులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అమిత్ షా మేజిక్, నరేంద్రమోదీ అనుభవంతో పాటు బీజేపీ కేంద్ర నాయకత్వం మొత్తం ఈసారి సవాలుగా తీసుకుని తెలంగాణ ఎన్నికల ప్రచారం నిర్వహించిన తీరు బరిలో ఉన్న అభ్యర్థుల్లో సంతృప్తిని మిగిల్చింది. బీజేపీ విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలోనూ, ప్రత్యర్థి పార్టీలను తీవ్రంగా ఎండగట్టడంలో విజయం సాధించడంతో బీజేపీ అభ్యర్ధుల్లో గెలుపు ధీమా వ్యక్తమవుతోంది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులకు ఓటు శాతం బాగా పెరుగుతుందనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ముందస్తు ప్రకటన విడుదలైన వెంటనే ఎన్నికలకు సన్నద్ధమైన బీజేపీ ఆనాడే రాష్ట్రంలో అనూహ్య ఫలితాలు రాబోతున్నాయని పేర్కొంది. ఎన్నికల అనంతరం ఏర్పాటయ్యే ప్రభుత్వం తమ ప్రమేయం లేకుండా జరగదని పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి పి మురళీధరరావు అనేక మార్లు చెప్పారు. గత మూడేళ్ల నుండే పార్టీని సంస్థాగతంగా సన్నద్ధం చేసిన నేతలు ఎన్నికల ప్రకటనతో బూత్ స్థాయి ప్రత్యేక కమిటీలను నియమించి గ్రామగ్రామాన ప్రచారానికి సిద్ధమైంది. మిగిలిన పార్టీలు ఊహించని రీతిలో జాతీయ స్థాయిలో 40 మంది నాయకులను రంగంలోకి దించి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ప్రధాని నరేంద్రమోదీ , పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, మాజీ అధ్యక్షులు , కేంద్ర మంత్రులు నితిన్ గడ్కారీ, రాజ్‌నాధ్‌సింగ్ సహా నాలుగు రాష్ట్రాల సీఎంలు కూడా ఈ ఎన్నికల ప్రచార బరిలోకి దిగడంతో బీజేపీ నేతలు ఉత్సాహం రెట్టింపైంది. వీరందిరికీ తోడు స్వామి పరిపూర్ణానంద కూడా బీజేపీలో చేరడం, వెనువెంటనే ఆయన ఎన్నికల ప్రచారానికి సిద్ధమై దాదాపు 50 సభలలో రోడ్‌షోల్లో పాల్గొని ఉత్సాహాన్ని నింపారు. ప్రధానంగా అధికార పార్టీకి అందించిన నిధులు, కేంద్రం వాటా, రాష్ట్భ్రావృద్ధికి చేసిన సాయం గురించి శాఖల వారీ ఆయా మంత్రులు వివరించగా, అమిత్ షా తన ఉపన్యాసాల్లో రాష్ట్రానికి ఇచ్చిన నిధులకు ఇంత వరకూ రాష్ట్రం లెక్క చెప్పడం లేదని నిలదీశారు. మరో పక్క రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఎంత వరకూ అమలుచేసిందంటూ నిలదీశారు. ఒక దశలో దళితుల వాదనను వినిపిస్తూ , రాష్ట్రంలో దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని సీఎం పేర్కొన్న అంశాన్ని ప్రస్తావిస్తూ ఈసారైనా దళితుడ్ని సీఎంని చేసే ఆలోచన ఉందా అంటూ నిలదీశారు. ఇంకో పక్క ప్రజాకూటమిపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 34.3 శాతం, కాంగ్రెస్‌కు 25.2 శాతం, టీడీపీకి 14.7 శాతం, ఎంఐఎంకు 3.8 శాతం, బీజేపీకి 7.1 శాతం ఓట్లు వచ్చాయి. గత సారి సగటున 69 శాతం వరకూ పోలింగ్ జరగ్గా, ఈ సారి పోలింగ్ శాతం భారీగా 75 శాతం వరకూ పెరుగుతుందనే అంచనాలు వేస్తున్నారు.