తెలంగాణ

ముఖ్యమంత్రి కోడ్ ఉల్లంఘన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ చింతమడక ఎన్నికల పోలింగ్ బూత్ వద్ద నిలబడి ప్రత్యక్షంగా మీడియా ముందు ప్రచారానికి దిగడాన్ని బీజేపీ సవాలుగా తీసుకుంది. ఈ అంశంపై ఇప్పటికే బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎన్ ఇంద్రసేనారెడ్డి రాష్ట్ర ఎన్నికల అధికారి (సీఈఓ)కి ఫిర్యాదు చేశారు. ఎన్నికల అధికారి స్పందన చూసి తదుపరి చర్యలకు పూనుకోవాలని బీజేపీ చూస్తోంది. అవసరమైతే కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారికి సైతం కలిసి ఒక ఫిర్యాదు ఇవ్వాలని సానుకూల స్పందన రాని పక్షంలో న్యాయస్థానంలో ఫిర్యాదు చేయాలని బీజేపీ యోచిస్తోంది. పార్టీలను ఆంక్షలతో నిర్దయగా అడ్డుకున్న ఎన్నికల కమిషన్ ముఖ్యమంత్రి కేసీఆర్ నేరుగా పోలింగ్ బూత్ వద్దనే ప్రచారానికి దిగినా, ఎలాంటి ఫిర్యాదు అందలేదనే సాకుతో ఎన్నికల అధికారి తప్పించుకోకుండా ఉండేందుకు బీజేపీ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఫిర్యాదుపై 24 గంటలు గడచినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీజేపీ భావిస్తోంది. చింతమడక పోలింగ్ బూత్ వద్ద సీఎం ప్రచారం చేసే విధంగా వ్యవహరించారని తద్వారా ఆయన కోడ్ ఉల్లంఘించారని బీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి కృష్ణసాగరరావు శుక్రవారం నాడు ప్రెస్‌మీట్ పెట్టి ఆరోపించారు. ఓటు వేసిన తర్వాత అందరూ ఓటు వేయమని కోరాల్సిన సీఎం ఎలక్ట్రానిక్ మీడియా ముందుకు వచ్చి ప్రజలు అంతా చూస్తుండగానే ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను, నియమావళిని అతిక్రమించారని పేర్కొన్నారు. ప్రజలను ఉద్ధేశించి పార్టీని ప్రమోట్ చేసేలా మాట్లాడారని, తమ పార్టీ గెలుస్తుందని చెప్పడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకత లేదని, అన్ని పవనాలూ తమ వైపు వీస్తున్నాయని పేర్కొన్నారని బీజేపీ నేతలు వివరించారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఇంత స్పష్టంగా నియమాలను ఉల్లంఘించడం చాలా ఘోరమని బీజేపీ పేర్కొంది. పోలింగ్ రోజు నేరుగా ప్రచారం చేసుకోవడం అన్ని నియమాలను ఉల్లంఘించడమేనని, కనుక కేసీఆర్ అభ్యర్ధిత్వాన్ని రద్దు చేసి, అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల అధికారిని కోరినట్టు పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టేది లేదని, ఎంతవరకైనా తీసుకువెళ్తామని, అధికారుల స్పందన చూసి సానుకూలంగా లేకుంటే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు.