తెలంగాణ

పాములు పట్టే వ్యక్తి పాముకాటుకు బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసిఫాబాద్ రూరల్, డిసెంబర్ 8: ఎవరి ఇంట్లో పాము కనిపించినా వెళ్లి ఇట్టే పట్టే బోయిరె చందు అనే వ్యక్తి అదే పాము కాటుకు బలి కావడం పట్ల పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కుమ్రం భీం ఆసిఫాబాద్ పట్టణంలోని బెస్తవాడకు చెందిన బోయిరె చెందు ఎంతటి పామునైనా ఇట్టే పట్టి అడవుల్లో వదిలి వేస్తాడు. దీంతో ఎవరింట్లో పాము కనిపించినా చందుకు సమాచారం ఇవ్వడం, మొదటి నుండి సేవాదృక్పదంతో పనిచేసే ఆయన క్షణాల్లో అక్కడికి చేరుకొని విషసర్పాలను సంచుల్లో బంధించి అటవీ ప్రాంతాల్లో వదిలివేస్తా డు. అయితే ఎప్పటిలాగానే శుక్రవారం ఇంటినుండి బయలు దేరిన చందు రాత్రి 8 గంటల ప్రాంతంలో తీవ్ర అస్వస్థతతో ఇంటికి చేరుకున్నాడు. నోటి నుండి నురుగులు కక్కుతున్న చందును స్థానికుల సహాయంతో అతని భార్య ప్రభుత్వాసుపత్రికి చేర్పించింది. చికిత్స పొందుతూనే చందు మృతి చెందాడు. భార్య తెలిపిన వివరాల ప్రకారం చందు చూపుడు వేలుపై విషసర్పం కాటు పడిన గుర్తు ఉంది. పాములు పడుతూ అందరికి సుపరిచితుడైన చందు మృతితో జిల్లా కేంద్రంతోపాటు చుట్టు పక్కల గ్రామాల్లో విషాధ ఛాయలు అలుముకున్నాయి. శనివారం స్థానిక పెద్దవాగు వద్ద జరిగిన చందు అంత్యక్రియలకు బిజెవై ఎం జిల్లా అధ్యక్షుడు విషాల్ ఖాండ్రెతోపాటు, వేలాది మంది తరలి వచ్చారు.
చిత్రం..మృతి చెందిన చందు