తెలంగాణ

ఆందోళన ...ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అచ్చంపేట, డిసెంబర్ 8: శాసన సభ ఎన్నికల సందర్బంగా శుక్రవారం అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లో జరిగిన పోలీసుల లాఠీచార్జీలో గాయపడ్డ టీఆర్‌ఎస్ కార్యకర్త నేనవత్ చంద్రు(35) శనివారం ఉదయం అచ్చంపేట సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించగా అడిషనల్ ఎస్పీ జోగులచెన్నయ్య, డీఎస్పీ నర్సింహులు అక్కడికి చేరుకొని వారిని సముదాయించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కుటుంబ సభ్యులు,గిరిజన నేత బీచ్యానాయక్‌లతో మాట్లాడారు. చంద్రు కుటుంబాన్ని పార్టీ అన్ని రకాలుగా ఆడుకుంటుందని అదైర్యపడవద్దని జరగకుడని సంఘటన జరిగిందని భాద్యులపై చట్టపర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు భాదిత కుటుంబ సభ్యులను పరమర్శించి వెళ్ళుతున్న మాజీ ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ వాహనానికి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వాహనం ఎదురు పడడంతో ఒకరినొకరు నేవ్వెంత అంటే నువ్వెంత.. చూసుకుందాం అంటే చూసుకుందాం అని మాట మాట అనుకోవడంతో వారికి కార్యకర్తలు తోడవడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడడంతో సీఐ రామకృష్ణ ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టి సముదాయించారు. జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి మృతుని భార్య, పిల్లలను పరామర్శించారు. ప్రభుత్వం తరపున సీఎం రిలిఫ్ ఫండ్‌తోపాటు ఆర్థిక సహాయం, పిల్లలకు గురుకులాలో ఉచిత విద్య, మృతిడి భార్యకు ఉపాధి చూపెడతామని ,పోస్ట్‌మార్టం రిపోర్టు ప్రకారం భాద్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామి ఇ వ్వడంతో కుటుంబ సభ్యులు శాంతించారు. మన్ననూర్‌లో లాఠిచార్జిలో తీవ్రంగా గాయపడి వ్యక్తి మృతి చెందాడు అని తెలియడంతో అచ్చంపేట ఆసుపత్రికి జనాలు బారిగా తరలివచ్చారు. ఎన్నికల సందర్బంగా అమ్రాబాద్ సీఐ బీసన్న వ్యవహారించిన తీరు పట్ల భాదితులు గిరిజన సంఘాలు, పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని పార్టిల నాయకులు భాదితకుటుంబాన్ని ఆదుకొవాలని నినాదాలు చేశారు. డీఎస్పీ నర్సింహులు, సీఐ రామకృష్ణల ఆధ్వర్యంలో, ఎస్‌ఐలు పరశురాం, రమేష్, విష్ణు, విక్రమ్‌లతో పాటు ప్రత్యేక సాయుధ బలగాల పోలీసులు ఆందోళనజరుగకుండాచర్యలు తీసుకున్నారు. అనంతరం భాదిత కుటుంబ సభ్యులు, గిరిజన సంఘం నేతలు నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీ్ధర్, ఎస్నీ డాక్టర్ సాయి శేఖర్ లను కలిసి మృతుడి కుటుంభానికి రూ 50 లక్షలు పరహారం, భార్యకు ఉద్యోగం, మూడు ఎకరాల భూమి ఆందించాలని భాద్యలైన వారిపై కఠిన చర్యలు తిసుకొవాలని ఇరువురికి వినతి పత్రాన్ని అందించారు.మృతడి కుటుంబాన్ని ఆదుకొవాలని గిరిజన సంఘం జిల్లా నేతలు రాంచందర్ నాయక్, బీచ్యానాయక్, రాజగోపాల్ , రాములు, లచ్చునాయక్ డిమాండ్ చేశారు.
చిత్రాలు.. *ఆందోళనకారులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బాలరాజు. *నేనవత్ చంద్రు మృతదేహం (ఇన్‌సెట్‌లో )