తెలంగాణ

మాతా శిశు సంరక్షణపై అంతర్జాతీయ సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 9: సంతానోత్పత్తి, ప్రసవాలు, స్ర్తి సంబంధిత, చిన్నారులు, నవజాత శిశువులకు సంబంధించి ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్య పద్ధతుల ద్వారా తల్లి, బిడ్డలకు అత్యున్నత వైద్య ఫలితాలను అందించవచ్చని ప్రపంచ ప్రఖ్యాతి చెందిన డాక్టర్లు అభిప్రాయపడ్డారు. అపోలో హాస్పిటల్స్, అపోలో క్రెడిల్, అపోలో ఫెర్టిలిటీల అధ్వర్యంలో ఒబెస్ట్రిక్స, గైనకాలజీ, ఫెర్టిలిటీ, నియోనాటాలజీల వైద్యానికి సంబంధించి నేషనల్ క్రెడిల్ కాన్ఫరెన్స్-2018 (మాతా శిశు సంరక్షణ) రెండు రోజుల పాటు నగరంలో జరిగింది. అపోలో హాస్పిటల్స్ గ్రూపు చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి లాంఛనంగా ఈ సదస్సును ప్రారంభించారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వైద్య ప్రముఖులు కెనడా మెక్‌గిల్ యూనివర్సిటీకి చెందిన ఒబిస్ట్రిక్స్ అండ్ గైనకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ సియంగ్ లిన్ టాస్, యూఎస్‌ఎ, న్యూజెర్సీ డబ్ల్యుఎం కెక్ సెంటర్ ఫర్ కొలాబరేటివ్ వ్యవస్థాపక డైరెక్టర్, న్యూరో సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ వైస్ యంగ్, ఆస్ట్రేలియా, క్వీన్స్‌లాండ్ యూనివర్సిటీ ఆఫ్ ఒబెస్ట్రిక్స్, గైనకాలజీ డిపార్ట్‌మెంట్ ప్రొఫెసర్ శైలేష్ కుమార్, అస్టియాపోరోసిస్ కన్సలెంట్ డాక్టర్ సందీప్ శర్మ, పీడీయాట్రీక్ ఎండోక్రినాలజిస్టు డాక్టర్ హిమ బిందు అవటపల్లె తదితరులు ప్రసంగించారు. క్లిష్టమైన నవజాత శిశువులు, వైద్య, శస్త్ర చికిత్స సమస్యలు, క్లిష్టమైన ఫెర్టిలిటీ కేసులను సమర్థంగా నిర్వహించినట్లు డాక్టర్లు తమ అనుభవాలను తెలిపారు.