తెలంగాణ

పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: తెలంగాణలో బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా పార్టీని రూపొందిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విపత్కర పరిస్థితుల్లోనూ 15 లక్షల మంది బీజేపీకి ఓటు వేసి ఆదరించినందుకు అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు , నిరంతరం బీజేపీ కృషి చేస్తుందని ఆయన చెప్పారు. ముషీరాబాద్ నియోజకవర్గ ఓటర్లు అందరికీ ఆయన బుధవారం నాడు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ అభ్యర్థిగా నిలిచిన తనకు ఓటు వేసిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు చెప్పారు. తనమీద నమ్మకంతో, విశ్వాసంతో ఓటువేసిన వారికి , మిగిలిన వారికి కూడా తాను ధన్యవాదలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. గతంలో తనను రెండు పర్యాయాలు ఈ ప్రాంతం నుండి గెలిపించారని, ప్రజలతో మమేకం అయ్యేందుకు , అభివృద్ధి చేసేందుకు నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించారని, ప్రజలు ఇచ్చిన తీర్పును శిరుసావహిస్తూనే భవిష్యత్‌లో కూడా ఈ ప్రాంత ప్రజల కోసం అందుబాటులో ఉంటానని , నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.