తెలంగాణ

కుంతియా, ఉత్తమ్‌ను తప్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయానికి బాధ్యులైన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిని తక్షణం పదవుల నుంచి తొలగించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. అలాకే పలువురు బాధ్యులను తప్పించి కొత్తవారిని నియమించాలని ఆయన కోరారు. సుధాకర్ రెడ్డి శుక్రవారం యుపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిసి తెలంగాణలో పార్టీ ఓటమికిగల కారణాలపై నివేదిక అందజేశారు. టీడీపీతో పొత్తు వల్ల కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజలు పరాయిపాలనను ఎంత మాత్రం ససించరనేది తెలిసి కూడా టీడీపీతో పొత్తుపెట్టుకుందని, తద్వారా భారీ మూల్యం చెల్లించుకున్నామని పొంగులేటి అన్నారు. ఈ విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం పెద్ద తప్పు చేసిందని ఆయన చెప్పారు. ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహించి తమ పదవులకు స్వచ్ఛందంగా రాజీనామా చేయాల్సిన బాధ్యత ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు, ఏఐసీసీ ఇన్‌చార్జి కార్యదర్శి, ఇతర కార్యదర్శులు, ఇతర పదాధికారులపై ఉందని సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చి ఇన్ని రోజులైనా వీరు ఇంకా తమ పదవులకు రాజీనామా చేయకపోవటం విడ్డూరంగా ఉన్నదని అన్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య జరగాల్సిన ఎన్నికల పోరాటం మధ్యలో టీడీపీ రావడంతో మారిపోయిందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ మూడో స్థానానికి నెట్టబడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి పీసీసీ నాయకత్వం బాధ్యత వహించవలసిన అవసరం లేదా? అని ఆయన ప్రశ్నించారు.