తెలంగాణ

సమర్థులకే మంత్రి పదవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: సమర్థులకే ఈసారి మంత్రి పదవులు ఇవ్వనున్నట్టు టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో స్పష్టం చేసినట్టు తెలిసింది. అలాగే ఎమ్మెల్యేలకు నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వడం లేదని తేల్చి చెప్పినట్టు తెలిసింది. తెలంగాణ భవన్‌లో శుక్రవారం పార్టీ అధ్యక్షులు కేసీఆర్ అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో మొదట ఎమ్మెల్యే కేటీఆర్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడాన్ని అమోదించే తీర్మానాన్ని పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రవేశపెట్టారు. రాష్ట్ర కార్యవర్గం కేటీఆర్ నియామకాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ తర్వాత కేసీఆర్ మాట్లాడుతూ ఇక నుంచి తాను, పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు జాతీయ రాజకీయాలతో పాటు ప్రభుత్వ వ్యవహారాల్లో బిజీగా ఉంటామని తెలిపారు. ఈ కారణంగానే పార్టీ బాధ్యతలను కేటీఆర్‌కు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ఇకనుంచి ప్రతిరోజు కేటీఆర్ పార్టీ నేతలు, శ్రేణులకు తెలంగాణ భవన్‌లో అందుబాటులో ఉంటారని తెలిపారు. పార్టీకి, ప్రభుత్వానికి అనుసంధానకర్తగా వ్యవహరించాలని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. అలాగే త్వరలో జరుగనున్న స్థానిక ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలకు పార్టీని శ్రేణులను సమాయత్తం చేయడానికి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో, సంక్షేమ పథకాల అమలును కూడా పార్టీ కార్యవర్గం పర్యవేక్షించాలని ఆదేశించారు.
నియోజకవర్గాలను ఎమ్మెల్యేలు శాసించడం కాదు, పార్టీ శాసించే విధంగా తీర్చిదిద్దాలని కేసీఆర్ సూచించారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గం ఇకనుంచి లోక్‌సభ ఎన్నికలు జరిగే వరకు పార్టీ కార్యాలయంలో ప్రతిరోజు సమావేశం కావాల్సిందిగా ఆదేశించారు.